రోటి కపడా రొమాన్స్ టైటిల్ తో సినిమా చేయాలనుకున్నా : దిల్ రాజు

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (17:57 IST)
Roti Kapada romans team with Dil Raju
హుషారు, సినిమా చూపిస్తమావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత లక్కీ మీడియా అధినేత  బెక్కెం వేణుగోపాల్ సృజన్‌ కుమార్ బొజ్జం తో కలిసి నిర్మించిన తాజా చిత్రం ’ రోటి కపడా రొమాన్స్‘. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష ,మేఘలేఖ,   ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ లోగోను శుక్రవారం స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్ర కథ నేను విన్నాను. ఇలాంటి టైటిల్ తో నేను ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తీద్ధామని అనుకున్నాను. అయితే తమ సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ గా వుంటుందని అడిగితే  ఈ టైటిల్ ఇచ్చేశాను. కొత్త నటీనటులతో , సాంకేతిక నిపుణులతో, ట్రెండీ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం కంటెంట్ కొత్తగా వుంటుందని అనుకుంటున్నాను. కొత్త కంటెంట్ ఇస్తే మన ఆడియన్స్ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా అదే కోవలో చేరాలని ఆశిస్తున్నాను‘ అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మా సంస్థలో చాలా యూత్ ఫుల్ సినిమాలు చేశాను. ఆడియన్స్ కూడా ఆ చిత్రాలను బాగా ఆదరించారు. 
 
మళ్లీ అలాంటి యూత్ ఫుల్ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమాను నిర్మించాను. పక్కా యూత్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో ఆల్ ఎమోషన్స్ వుంటాయి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం దిల్ రాజు గారికి కథ చెప్పాలని ఆయన ఆఫీస్ బయట తిరుగుతుండేవాడిని. ఇప్పుడు నా సినిమాకు ఆయనే  టైటిల్ ఇచ్చి ఆయన  చేతుల మీదుగా టైటిల్ ను ఆవిష్కరించడం 
నాకెంతో ప్రత్యేకమైనది. రోటి కపడా రొమాన్స్ ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఆల్ ఎమోషన్స్ వుంటాయి. నేటి యూత్ కనెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు నిర్మాత వేణు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. ఆ కోవలోనే ఆయన నాకు అవకాశం ఇచ్చారు. కథకు తగ్గ నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న వేములవాడ ఎమ్మెల్యే

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments