Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మస్‌కు వచ్చేస్తోన్న షకీలా..

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:32 IST)
Shakeela
దక్షిణాదిన శృంగార తారగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది షకీలా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం షకీలా. రిచా చద్దా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. 2019లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
 
ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సామిస్ మ్యాజిక్- సినిమా మోషన్ పిక్చర్ ప్రొడక్షన్ సమర్పించి నిర్మించింది. యూఎఫ్ఓ పంపిణీ చేస్తుంది. ఇది క్రిస్మస్ విడుదలకు రెడీ అవుతోంది.
 
ఇకపోతే.. రిచా చద్దా షకీలా లుక్ రిలీజై వైరల్ అయ్యింది. తాజాగా లాంచ్ అయిన పోస్టర్ రిచాను ఆకర్షణీయమైన అవతారంలో ఆవిష్కరించింది. చీరలో ఉన్నా చేతిలో తుపాకీతో ఆమె సౌత్ సైరన్ పాత్రకు సరైన నటి అన్న భావన కలిగించింది. అయితే బాక్సాఫీస్ ఫలితం పోస్టర్ లుక్‌తో సాధ్యం కాదు. కానీ షకీలా జీవితంలో సౌత్ స్టార్ల పాత్రలు వర్కవుటైతే ఇక్కడ బాగా డబ్బు గుంజే వీలుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments