Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్‌కు రవ్వంత హాని చేయలేదు.. డ్రగ్స్ తీసుకోను.. సిగరెట్ కాల్చుతా : రియా చక్రవర్తి

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (11:16 IST)
తన ప్రియుడు, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు తాను రవ్వంత కూడా హాని చేయలేదని, తాను ఏపని చేసిన అది సుశాంత్‌కు మంచే జరిగిందని బాలీవుడ్ నటి రియా చక్రవర్తి చెప్పుకొచ్చింది. సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం బయటపడిన విషయం తెల్సిందే. దీంతో రియా చక్రవర్తి వద్ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విడతలవారీగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ మేనేజరు శామ్యూల్, రియా సోదరు షోవిక్ చక్రవర్తిలను అరెస్టు చేయడం జరిగింది. 
 
ఇక, హీరోయిన్ రియాను కూడా విచారిస్తోంది. ఈ కేసులో సోమవారం రియాను 8 గంటలపాటు ఎన్‌సీబీ విచారించింది. ఈ సందర్భంగా రియా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిందట. డ్రగ్స్ తీసుకునే అలవాటున్న పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను బయటపెట్టిందట. 
 
అలాగే సుశాంత్ కోసం తాను డ్రగ్స్ తెప్పించినట్టు అంగీకరించిందట. తను మాత్రం ఇప్పటివరకు డ్రగ్స్ తీసుకోలేదని, కావాలంటే పరీక్ష చేయించుకోవచ్చని తెలిపిందట. అయితే సిగరెట్ తాగే అలవాటుందని చెప్పిందట. తానేం తప్పులు చేసినా, సుశాంత్ ప్రేమ కోసమే చేశానని చెప్పిందట. 
 
మరోవైపు, ఎన్.సి.బి జరుపుతున్న విచారణలో రియా చక్రవర్తి  అనేక మంది బాలీవుడ్‌కి చెందిన బడా స్టార్స్‌ పేర్లు బయటపెట్టినట్టు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ విచారణలో డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు అంగీకరించింది. అయితే, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదనీ, కానీ సిగరెట్ కాల్చుతానని చెప్పుకొచ్చింది. 
 
అలాగే, సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఎవరికీ తెలియదని, అతను చెబితేనే తాను వాట్సప్‌ గ్రూప్‌లో చాట్‌ చేస్తానని, అవి సుశాంత్ స్టాఫ్‌ మెంబర్స్‌ ద్వారా డెలివరీ అవుతుంటాయని రియా వెల్లడించినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments