Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవెంట్ మేనేజర్‌ ఫిర్యాదుతో చిక్కుల్లో పడిన హీరోయిన్.. సీసీబీ ఆరా!

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (11:07 IST)
కన్నడ చిత్ర పరిశ్రమలు డ్రగ్స్ వ్యవాహారం ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే శాండిల్‌వుడ్ నటి రాగిణి ద్వివేదిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. ఇపుడు మరో హీరోయిన్ సంజన గల్రానీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈవెంట్ మేనేజరు ప్రీతమ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈమె ఇంట్లో సీసీబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ మూలాలు వెలుగు చూశాయి. దీనిపై సీసీబీ పోలీసులు ఆరా తీయగా, కీలక సమాచారాన్ని రాబట్టారు. సీసీబీ అరెస్టు చేసిన డ్రగ్స్ ముఠా నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. ఇందులో ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. 
 
ఈ క్రమంలో న‌టి రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్ట్ చేయ‌గా, తాజాగా సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈవెంట్ మేనేజ‌ర్ ప్రీత‌మ్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగ‌ళూరులోని ఇందిరా న‌గ‌ర్‌లో ఉన్న సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. 
 
ఈ సోదాల‌లో కీల‌క ఆధారాలు ల‌భ్య‌మైతే సంజ‌న‌ని అరెస్టు చేయ‌డం ఖాయం అని అంటున్నారు. ఇంక ఈమె ద్వారా డ్ర‌గ్స్ ఉచ్చులో ఇంకెంత‌మంది చిక్కుకున్నార‌నే విష‌యాన్ని రాబ‌ట్ట‌నున్నారు. తాజాగా ఈ కేసులో డిజైనర్ నియాజ్‌ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments