Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఆర్డీవో ఆఫీసులో రియా చక్రవర్తి.. సీబీఐ ప్రశ్నల వర్షం

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (11:46 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి శుక్రవారం సీబీఐ విచారణకు హాజరైంది. ఇందుకోసం ఆమె శుక్రవారం ఉదయం తన నివాసం నుంచి డిఆర్డీవో కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పలువురు అధికారులు ఆమెను ప్రశ్నల వర్షంలో ముంచెత్తుతున్నారు. దీంతో ఆమె ఉక్కిరిబిక్కిరైపోతున్నట్టు సమాచారం. 
 
కాగా, సుశాంత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా, ఇప్పటికే అనేక మంది వద్ద విచారణ జరిపిన సీబీఐ అధికారులు... సుశాంతి ప్రియురాలైన రియా చక్రవర్తి వద్ద కూడా విచారణ జరపాలని నిర్ణయించి, ఆమెకు సమన్లు పంపించారు. దీంతో ఆమె శుక్రవారం ఉదయం ముంబైలోని డీఆర్‌డీవో అతిథిగృహానికి వచ్చింది. అక్కడే సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమెతో పాటు సుశాంత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితానీని కూడా సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నించనున్నాను. 
 
కాగా, గురువారం రియా సోదరుడితో పాటు, సుశాంత్ సింగ్‌ కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారించారు. కాగా, రియా తన కుమారుడిని మానసికంగా వేధించి, డబ్బులు తీసుకుందని సుశాంత్ తండ్రి ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ ఇంట్లో పనిచేసే వారిని సీబీఐ అధికారులు ప్రశ్నించగా పలు విషయాలు బయటపడ్డాయి. 
 
మరోవైపు, సుశాంత్ మృతి తర్వాత తాను ఎంతో మానసికవేదనకు లోనైనట్టు చెప్పుకొచ్చింది. అందుకే అతని అంత్యక్రియలకు హాజరయ్యే వారి జాబితాలో తన పేరును చేర్చని కారణంగానే వెళ్లలేకపోయానని చెప్పింది. 
 
తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆమె, సుశాంత్‌ను కడసారి చూసేందుకు మార్చురీ వద్దకు వెళ్లానని, అక్కడ కూడా చాలా సేపు నన్ను లోనికి అనుమతించలేదని, మృతదేహాన్ని వ్యాన్ ఎక్కిస్తుంటే కేవలం మూడు నాలుగు సెకన్లు మాత్రమే చూశానని చెప్పారు.
 
ఆసమయంలో 'సారీ బాబూ' అని రియా వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, జీవితాన్ని కోల్పోయి, మరణించిన ఓ వ్యక్తిని క్షమించమని కోరడం మినహా తాను ఇంకేం చేయగలనని ప్రశ్నించారు. గౌరవంతో అతని పాదాలను తాకానని, భారతీయుడు ఎవరైనా దీన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. సుశాంత్ కుటుంబీకులకు తానంటే ఇష్టం లేదని, అందుకే తనను కష్టాలు చుట్టుముట్టాయని ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments