Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌వాడ‌లో రామ్‌గోపాల్‌వ‌ర్మ 'వంగ‌వీటి' బ్ర‌హ్మాండ‌మైన ఆడియో

విజ‌య‌వాడ న‌గ‌రంలోఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నాన‌ని అనౌన్స్ చేయ‌గానే సినిమాపై చాలా ఆస‌క్తి పెరిగింది. రామదూ

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (15:49 IST)
విజ‌య‌వాడ న‌గ‌రంలోఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నాన‌ని అనౌన్స్ చేయ‌గానే సినిమాపై చాలా ఆస‌క్తి  పెరిగింది. రామదూత‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుండి ప్రేక్ష‌కుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
 
గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేసిన వంగ‌వీటి ట్రైల‌ర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వ‌చ్చాయి. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమా ఆడియో విడుల కార్య‌క్ర‌మాన్ని గ్రాండ్‌గా విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేయ‌నున్నారు. 
 
ఇదే అంశంపై దర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ... 'విజ‌య‌వాడ రౌడీయిజంపై నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'వంగ‌వీటి' నాకు చాలా ప్ర‌త్యేక‌మైన చిత్రం. అప్ప‌ట్లో అక్క‌డ జ‌రిగిన చాలా సంఘ‌ర్ష‌ణ‌ల‌కు నేను ప్ర‌త్య‌క్ష‌సాక్షిని. ఇప్ప‌టికే విడుద‌లైన‌ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు, సాంగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ర‌వి శంక‌ర్ మ్యూజిక్‌లో రూపొందిన మిగిలిన పాట‌లు కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. 
 
డిసెంబ‌ర్ 3న వంగవీటి ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వాడ‌లోని కోనేరు ల‌క్ష్మ‌య్య యూనివ‌ర్సిటీ గ్రౌండ్స్‌లో పలువురి ప్ర‌ముఖుల స‌మక్షంలో విడుద‌ల చేయ‌నున్నాం. ఇప్పుడు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం' అన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments