Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్మ చాలా తెలివైనోడు అన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం..!

నాగ్ - వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందిన తాజా చిత్రం ఆఫీస‌ర్. జూన్ 1న ఆఫీస‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఆఫీస‌ర్ ప్రి-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వ‌హించారు. ఈ వేడుకలో దర్శకుడు ఆర్జీవీ ఎమోషనల్ స్

Webdunia
మంగళవారం, 29 మే 2018 (22:23 IST)
నాగ్ - వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందిన తాజా చిత్రం ఆఫీస‌ర్. జూన్ 1న ఆఫీస‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఆఫీస‌ర్ ప్రి-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వ‌హించారు. ఈ వేడుకలో దర్శకుడు ఆర్జీవీ ఎమోషనల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ఆయన శైలికి భిన్నంగా మాట్లాడుతూ.. నాగ్‌తో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ఓ దర్శకుడికి అయినా.. హీరోకి అయినా.. హీరోయిన్‌కి అయినా.. టెక్నీషియన్‌కి అయినా అవకాశం రావడం కాదు ఆ అవకాశం కల్పించేవాడు ఉండాలి. అప్పుడే ప్రతిభ బయటపడేది. నాకు అలా అవకాశం ఇచ్చారు నాగార్జున. 
 
నేను ఎలాంటి పాపాలు చేయలేదు, పుణ్యాలు చేయలేదు. దేవుడ్ని పూజించలేదు. నేను ఇప్పటివరకూ ఎలాంటి మంచి పనులు చేయకపోయినా నాగార్జున అనే ఓ మంచోడు నాకు దొరికాడు. మరి ముందు జన్మలో ఏమైనా మంచి చేశానేమో నాకు తెలియదు. నేనొక అడవిగుర్రం లాంటి వాడిని. దాన్ని ఆపితే మళ్లీ అది అడవి గుర్రం కాలేదు. నాగార్జున నా స్టీరింగ్ లాంటి వాడు. నాగార్జునలో నేను ఏది చూడాలని అనుకున్నానో ‘ఆఫీసర్’లో చూశా. నాగార్జున గురించి మాట్లాడాలంటే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాని అలా నా కళ్లల్లో నీళ్లు వస్తే ఇప్పటివరకూ ఉన్న నా రిప్యుటేషన్ పోతుంది. అందుకే మాట్లాడటం లేదు. 
 
నాగార్జున నాకు శివ చిత్రంలో బ్రేక్ ఇచ్చారు. నేను చాలా సార్లు చెప్పా.. ఓ హిట్ ఫిల్మ్ అంటే చాలామంది కారణాలు అంటారు. కాని ఫ్లాప్ అయితే ఒక్క దర్శకుడే కారణం అవుతుంది. అన్ని డిపార్ట్‌మెంట్‌లని మేనేజ్ చేసుకుంటూ రావాలి. అదే దర్శకుడి ప్రతిభకు నిదర్శనం అంటూ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారు : వెంకయ్య నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments