Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్యాలగూడలో ప్రెస్‌మీట్ పెడతా.. ఎవడు అడ్డొస్తాడో చూస్తా: రాంగోపాల్ వర్మ

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (15:43 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువకుడు ప్రణయ్ పరువు హత్య కేసును ఆధారంగా చేసుకుని ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా, వైశ్య కులానికి చెందిన అమృతను దళిత కులానికి చెందిన ప్రణబ్ ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, అమృత తండ్రి మారుతీ రావు కిరాయి హంతుకులతో ప్రణయ్‌ను హత్య చేయించారు. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలల జైలుశిక్ష తర్వాత బెయిలుపై విడుదలైన మారుతీరావు ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఇదిలావుంటే, అమృత - ప్రణబ్ ప్రేమకథను ఇతివృత్తంగా చేసుకుని మర్డర్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని గతంలోనే విడుదల చేయాలని ప్లాన్ చేశాడు. కానీ, అమృత కోర్టుకెక్కడంతో ఈ చిత్రం వాయిదాపడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. 
 
ఈ క్రమంలో ఆర్జీవీ శుక్రవారం మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన మిర్యాలగూడలో విలేకరుల సమావేశం నిర్వహిస్తానని, ఎవడు అడ్డొస్తాడో చూస్తానని హెచ్చరించాడు. దీంతో ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments