Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌యం' ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ హ‌న్సిక కాంబినేష‌న్ బోగ‌న్

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (15:26 IST)
జ‌యం' ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ హ‌న్సిక కాంబినేష‌న్ బోగ‌న్ అట‌. వివ‌రాల్లోకి వెళితే.. అర‌వింద్ స్వామి, స‌క్సెస్‌ఫుల్ హీరో జ‌యం ర‌వి, బ‌బ్లీ బ్యూటీ హన్సిక కాంబినేష‌న్లో తెర‌కెక్కి త‌మిళంలో సూప‌ర్ హిట్ టాక్ అందుకున్న బోగ‌న్ చిత్రాన్ని అదే పేరుతో ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్ష‌కులకి ముందుకు తీసుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇప్ప‌టికే బోగ‌న్ తెలుగు వెర్ష‌న్‌కి సంబంధించిన ట్రైల‌ర్‌తో పాటు సోనీ మ్యూజిక్ ద్వారా విడుద‌లైన అన్ని వీడియో సాంగ్స్ అటు సోష‌ల్ మీడియాతో పాటు ఇటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో బోగ‌న్ (తెలుగు)ను న్యూ ఇయ‌ర్ కానుక‌గా జ‌న‌వ‌రి 1, 2021న విడుద‌ల చేస్తున్నారు. ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై బోగ‌న్ (తెలుగు) భారీ స్థాయిలో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావటానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు.
 
'త‌ని ఒరువ‌న్' త‌ర్వాత 'జ‌యం' ర‌వి, అర‌వింద్ స్వామి కాంబినేష‌న్‌లో రూపొంది సూప‌ర్‌హిట్ట‌యిన మ‌రో సినిమానే  ఈ 'బోగ‌న్‌'. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీని డైరెక్ట‌ర్‌ ల‌క్ష్మ‌ణ్ రూపొందించారు. హీరోయిన్‌గా హ‌న్సికా మొత్వాని న‌టించిన ఈ చిత్రంలో నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, అక్ష‌ర గౌడ ఇత‌ర పాత్ర‌ధారులు. డి. ఇమ్మాన్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.
 
తారాగ‌ణం: జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి, హ‌న్సికా మొత్వానీ, నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, నాగేంద్ర‌ప్ర‌సాద్‌, వ‌రుణ్‌, అక్ష‌ర గౌడ‌, సాంకేతిక బృందం: సంభాష‌ణ‌లు: రాజేష్ ఎ. మూర్తి, సాహిత్యం:  భువ‌న‌చంద్ర‌, గాయ‌నీగాయ‌కులు: స‌మీర భ‌ర‌ద్వాజ్‌, శ్రీ‌నివాస‌మూర్తి, సాయినాథ్‌, అశ్విన్‌, దీపిక‌, సంగీతం: డి. ఇమ్మాన్‌, సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజ‌న్‌, కథ-  స్క్రీన్ ప్లే - ద‌ర్శ‌క‌త్వం: ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌: రామ్ తాళ్లూరి, బ్యాన‌ర్‌: ఎస్‌.ఆర్‌.టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments