''అర్జున్ రెడ్డి'' పోస్టర్లో తప్పుందా అని మీ మనవళ్లు, మనవారాళ్లను అడగండి!

పెళ్ళి చూపులు హీరో విజయ్ దేవరకొండ తాజా సినిమా ''అర్జున్ రెడ్డి'' వివాదాల చుట్టూ తిరుగుతోంది. ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికేట్ ఇచ్చిన నేపథ్యంలో.. ఆ సినిమా పోస్టర్లు అసభ్యంగా ఉన్నాయంటూ

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (09:04 IST)
పెళ్ళి చూపులు హీరో విజయ్ దేవరకొండ తాజా సినిమా ''అర్జున్ రెడ్డి'' వివాదాల చుట్టూ తిరుగుతోంది. ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికేట్ ఇచ్చిన నేపథ్యంలో.. ఆ సినిమా పోస్టర్లు అసభ్యంగా ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.
 
అర్జున్ రెడ్డి పోస్టర్లు అసభ్యంగా వున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు చించేయడం.. దీనిపై హీరో విజయ్ దేవరకొండ ‘తాతయ్యా...చిల్’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వివాదంపై వర్మ స్పందిస్తూ.. ‘అర్జున్ రెడ్డి’కి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. 
 
తాతయ్యా..‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ లో ఏమైనా తప్పు ఉందేమో మీ మనవళ్లను, మనవరాళ్లను అడగండి? అంటూ వర్మ అన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కచ్చితంగా మనవళ్లు, మనవరాళ్ల కోసమే కానీ, పాత ఆలోచనా ధోరణిలో ఉండే తాతయ్యల కోసం కాదు.. జస్ట్ చిల్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  
 
బస్సుపై ఉన్న''అర్జున్ రెడ్డి" పోస్టర్‌ను తొలగిస్తున్న వి.హనుమంతరావు ఫొటోను తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ.. మీ పార్టీ తాతయ్య అయిపోయిందన్నారు. వీహెచ్ పిల్ల చేష్టల ద్వారా ప్రజలు, మనవళ్లు, మనవరాళ్లు వచ్చే ఎన్నికల్లోనూ ఆ తర్వాత కూడా ఓటు వెయ్యరని ఎద్దేవా చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments