Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను : రేణూ దేశాయ్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (10:32 IST)
రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "టైగర్ నాగేశ్వర రావు". ఈ నెల 20వ తేదీన విడుదలకానుంది. అభిషేక్ నామా నిర్మాత. భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ-రీలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించిన నటి రేణూ దేశాయ్ కూడా పాల్గొని ప్రసంగించారు. 
 
తాను ఇండస్ట్రీకి వచ్చి 23 యేళ్లు అయింది. అయినా తాను నటించిన "బద్రీ" చిత్రం ఇటీవలే విడుదలైందనే ఫీలింగ్ కనిపిస్తుంది. ఇంతకాలంగా తాను తెలుగు సినిమాలు చేయకపోయినా, మీరంతా అదే ప్రేమను చూపిస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతూ వచ్చారు.. మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను అని అన్నారు. 
 
అలాగే, ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదలు. హీరో రవితేజ వంటి సీనియర్ హీరోతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం నాకు ఎంత ప్రాధాన్యత ఉందో ఆయనకి తెలియదు. ఈ వేదిక ద్వారా.. పర్సనల్ గాను రవితేజకు థ్యాంక్స్ చెబుతున్నాను. అంతా కూడా ఈ నెల 20వ తేదీన థియేటర్స్‌కి వెళ్లి ఈ సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అని రేణూ దేశాయ్ అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిన విమానం... ఆరుగురి మృతి

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments