Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణూ దేశాయ్ అలా చేసివుంటే.. పవన్ జైలుకు వెళ్లేవాడు..? (video)

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (18:22 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులు, ప్రేక్షకులకు టచ్‌లో వున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా షేర్ చేసిన ఓ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. 
 
2012లో పవన్ కల్యాణ్- రేణు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల బాధ్యతలు తీసుకుంటూ.. నటిగా, దర్శకురాలిగా సినీ కెరీర్ సాగిస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా ఆమె పవన్ కల్యాణ్ అభిమానులతో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కుంటున్నారు. 11 ఏళ్లుగా నిందితురాలిగా చూస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తాజాగా ఇన్‌స్టాలో రేణు దేశాయ్ పోస్టు చేసిన వీడియోలో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది. అందులో రేణు దేశాయ్ జీవితం గురించి ఆమె చెప్పుకొచ్చారు. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే అందరి దృష్టి ఆ మహిళపైనే ఉంటుంది తప్పా మగాడిని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పారు. 
 
పవన్ కల్యాణ్ విషయంలో రేణు దేశాయ్ ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో త్యాగాలు చేసింది. అలాంటి వ్యక్తిని వదులుకునే అవకాశమే రాకూడదు.
 
ఆరోజు తనకు కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు. పవన్ కల్యాణ్ నన్ను ఏదో ఒక చిన్న గుడిలో పెళ్లి చేసుకున్నారు అనే మాట చెప్పుంటే పవన్ కల్యాణ్‌కు జైలు శిక్ష పడేదని కృష్ణ కుమారి వెల్లడించారు. సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి మాట్లాడిన వీడియోను రేణు దేశాయ్ షేర్ చేస్తూ భావోద్వేగానికి గురైయ్యారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments