Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'వకీల్ సాబ్‌'కు సీక్వెల్ సిద్ధం చేస్తున్నా... వేణు శ్రీరామ్

Advertiesment
Vakeel sab working
, సోమవారం, 10 ఏప్రియల్ 2023 (16:10 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల్లో "వకీల్ సాబ్" ఒకటి. సూపర్ హిట్ చిత్రం. గత 2021లో విడుదలైంది. దిల్ రాజు నిర్మాత. బాలీవుడ్ చిత్రం "పింక్"కు ఇది రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నట్టు దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు అయిన సందర్భంగా దర్శకుడు నెటిజన్లతో తన మనసులోని మాటను వెల్లడించారు.
 
వకీల్ సాబ్ సీక్వెల్‌కు సంబంధించిన పనులు మొదలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ అప్‌డేట్‌తో అభిమానులు ఖుష్‌ అవుతున్నారు. ఈ సీక్వెల్‌ను ప్రకటించిన వెంటనే "వకీల్‌ సాబ్‌"లోని పాటలు, డైలాగులు నెట్టింట సందడి చేస్తున్నాయి. 
 
బాలీవుడ్‌ చిత్రం 'పింక్‌'కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో పవన్‌ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. పవన్‌ సరసన శ్రుతి హాసన్‌ నటించిన ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేదా థామస్‌ కీలక పాత్రల్లో కనిపించారు. మహిళల కోసం పోరాడే న్యాయవాది పాత్రలో పవన్‌ జీవించారు. ఈ సినిమాలోని కోర్టు సన్నివేశం మొత్తం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు దీని సీక్వెల్‌ ప్రకటించడంతో పవన్‌ను మరోసారి పవర్‌ఫుల్‌గా చూడనున్నామని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ -కె నుంచి స్క్రాచ్ ఎపి2 ప్రమోషన్ వీడియో