Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలేజీలు యూనవర్శిటీలకు వెళ్లలేదు.. అయినా నిత్యవిద్యార్థిని : పవన్ కళ్యాణ్

pawan kalyan
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (10:32 IST)
తాను కాలేజీలు, యూనివర్శిటీలకు వెళ్లలేదని అయినప్పటికీ తాను నిత్య విద్యార్థిని అని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. అదేసమయంలో సమాజ సేవ చేయాలన్న బలమైన లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. డబ్బు కోసమో, పదవుల కోసమో తాను రాలేదని తేల్చి చెప్పారు. 
 
గురువారం వరంగల్‌ నిట్‌లో వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ) కార్యక్రమాన్ని నిట్ సంచాలకుడు ఆచార్య ఎన్‌.వి.రమణారావుతో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పవన్‌ ప్రసంగిస్తూ... 'నేను కళాశాలలు, యూనివర్సిటీలకు వెళ్లలేదు. అయినా నిత్య విద్యార్థిని. ప్రతికూల పరిస్థితులను చూసి వెనకడుగు వేయొద్దు. నేడు విఫలమైనా రేపు తప్పకుండా గెలిచి తీరుతాం. పేటెంట్లు వచ్చినంత మాత్రాన ఆవిష్కరణ గొప్పది కాదు. సమాజానికి అది ఎంతవరకు మేలు చేస్తుందన్నదే ముఖ్యం. లక్షల మంది కలరా బాధితుల ప్రాణాలు నిలిపిన, నిలుపుతున్న 'ఓఆర్‌ఎస్‌' ద్రావణాన్ని కనుగొన్న డాక్టర్‌ దిలీప్‌ లాంటి వారు చేసిన ఆవిష్కరణలు గొప్పవి' అని స్పష్టంచేశారు.
 
'సినిమా వల్ల నాకెంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. "ఖుషీ" సినిమా తర్వాత న్యూజిలాండ్‌లో స్థిరపడదామని ఇమ్మిగ్రేషన్‌ కాగితాలను కూడా సిద్ధం చేసుకున్నా. తర్వాత కష్టమో... నష్టమో ఈ దేశంలోనే ఉండి, పుట్టినగడ్డకు నావంతు సేవ చేయాలని నిర్ణయించుకున్నా. నల్గొండలో ఫ్లోరైడ్‌ బాధితుల కడగండ్లు, ఆదిలాబాద్‌ తండాల్లో గిరిజన తాగునీటి కష్టాలు.. ఇలా పేదల ఇబ్బందులు నన్ను కదిలించాయి. అలాంటి వారికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా" అని పవన్‌ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసయ్యాను.. బ్రెయిన్ కంట్రోల్ కావడంలేదు.. అందుకే విడిచి వెళుతున్నా..