Webdunia - Bharat's app for daily news and videos

Install App

నో డౌట్.. తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటా: రేణుదేశాయ్

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (17:46 IST)
రేణు దేశాయ్ రెండవ పెళ్లికి నిశ్చితార్థం చేసుకుని చాలా నెలలు గడిచాయి. అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వారికి ఇష్టం వచ్చినట్లు కామెంట్‌లు పెడుతున్నారు. దొంగతనంగా పెళ్లి చేసుకుని ఉంటుందని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిశ్చితార్థం సమయంలోనే పెద్ద ఎత్తున ఆమెపై వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి. 
 
అందుకే పెళ్లి చేసుకుంటే వ్యతిరేకత ఎక్కువై భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఉందని పలువురు అనుమానపడుతున్నారు. కొంత మంది పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారా అని రేణు దేశాయ్‌ని నేరుగా ప్రశ్నిస్తున్నారట. 
 
తనపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ఆమె స్పందించింది. తానేమీ రహస్యంగా పెళ్లి చేసుకోలేదని, అంత అవసరం కూడా లేదని, ఇంత లోపు హడావుడి ఎందుకని అన్నారు. తన పెళ్లి గురించి ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని, త్వరలోనే అధికారికంగా అందరికీ చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. 
 
పూర్తి వివరాలు చెప్పకపోయినా తన పెళ్లికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటానని రేణూ దేశాయ్ చెప్పారు. తనకు కాబోయే భర్త కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా నుండి ఇండియా వచ్చాడు. ప్రస్తుతం పూణేలోని ఓ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని చెప్పింది. పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని, దాని గురించి చింతించాల్సిన అవసరం లేదని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments