Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణూ దేశాయ్.. బెల్లం కొండ శ్రీనివాస్‌కు అక్కగా వచ్చేస్తుంది..

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (16:08 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రస్తుతం నటన వైపు మొగ్గుచూపుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా దర్శకుడు వంశీకృష్ణ ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ చిత్రం టైగర్ నాగేశ్వర రావు బయోపిక్‌గా రూపుదిద్దుకోనుందని టాక్ వస్తోంది. ఈ సినిమాలో హీరోకి అక్క పాత్రలో రేణు దేశాయ్ నటించనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
ఇప్పటికే తల్లి పాత్రలతో నదియా, ఖుష్బూ, రమ్యకృష్ణ వంటి సీనియర్ హీరోయిన్లు బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్న రేణూ దేశాయ్‌ సోదరి పాత్రలో కనిపించనుంది. ఈ రోల్ ద్వారా రేణూ దేశాయ్ సినిమా కెరీర్ మలుపు తిరుగుతుందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. దొంగాట ఫేం వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
 
పవన్ కళ్యాణ్ సరసన నటించిన జానీ చిత్రం తర్వాత రేణూ దేశాయ్.. మళ్లీ నటన జోలికి వెళ్లలేదు. అలాంటి జానీ సినిమా రిలీజై.. 15 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రస్తుతం దర్శకురాలిగా అవతారం ఎత్తిన రేణూ దేశాయ్‌కి మంచి సక్సెస్ రాకపోవడంతో... తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారట. ముందుగా ఈ చిత్రం కోసం దర్శకుడు హీరోగా రానాని సంప్రదించారట. కానీ రానా తప్పుకోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ చేతుల్లోకి ఈ ప్రాజెక్టు వెళ్ళిందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments