Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నునొప్పినుంచి కోలుకుంటున్నాః విశాల్‌

Webdunia
గురువారం, 22 జులై 2021 (14:01 IST)
Visal action
హీరో విశాల్ న‌టిస్తున్న సినిమా `ఎనిమి`. త‌న‌ స్నేహితుడు ఆర్యతో క‌లిసి చేస్తోన్న‌సినిమా ఇది. విశాల్ త‌న 31వ చిత్రం ఇది. నాట్‌ ఏ కామన్‌ మ్యాన్ అనేది టేగ్‌లైన్‌. ఈ సినిమాలోని యాక్ష‌న్ పార్ట్ తీస్తుండ‌గా గ‌త నెల‌లో విశాల్ కంటికి గాయాల‌య్యాయి. షోడా బుడ్ల‌తో ఫైట్ చేస్తుండ‌గా అది జ‌రిగింది. ఆ త‌ర్వాత కొంత గేప్ తీసుకున్నారు. తాజాగా మూడు రోజుల క్రితం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలోనే యాక్ష‌న్ ఎపిసోడ్ చేస్తున్నారు. క్ల‌యిమాక్స్ కోసం భారీ స్టంట్లు కంపోజ్ చేశారు ఫైట్ మాస్ట‌ర్స్‌. అయితే ఇందులో ఓ స్టంట్ చేసే స‌మ‌యంలో ‏ప్ర‌మాద‌వ‌శాత్తు వెన‌క‌వైపు నుండి బలంగా గోడకు తాక‌డంతో కిందపడిపోయారు విశాల్‌. ఈ ప్రమాదంలో విశాల్‌ వెన్ను భాగానికి దెబ్బతగిలింది.
 
దీంతో పిజియోథెర‌పీస్ట్ డా.వ‌ర్మ ఆయ‌న‌కు వెంట‌నే చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని త్వ‌ర‌లోనే షూట్‌లో పాల్గొంటార‌ని గురువారంనాడు ఫిలింసిటీలో ఆయ‌న్ను క‌లిసిన వారికి తెలియ‌జేశారు. హీరో విశాల్ ప్రతిసారీ ఇలా గాయపడుతుండడంతో ఆయన అభిమానులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.

`ఈదు థెవైయో అధువే ధర్మం` అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తు.పా. శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీని విశాల్‌ ఫిలిం ఫ్యాక్ట‌రి బేన‌ర్ పై విశాల్ నిర్మిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments