Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంథుడు, పోలీస్‌గా క‌మ‌ల్‌- కోట్లలో బిజినెస్ అయిన‌ విక్ర‌మ్‌

Webdunia
గురువారం, 22 జులై 2021 (13:36 IST)
kamal
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం `విక్రమ్`. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ న‌టిస్తున్నారు. ఈ ముగ్గురుకు సంబంధించిన పోస్ట‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతో ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్. ఇందులో క‌మ‌ల్ రెండుపాత్ర‌లు పోషిస్తున్నాడ‌ని స‌మాచారం. అంథుడిగానూ, పోలీస్‌గానూ న‌టిస్తున్నాడు. అంథుని పాత్ర కొంత మేర‌కే వుంటుంద‌ని తెలుస్తోంది. 1981లో సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో “రాజా పార్వై”లో కమల్ హాసన్ అంధుడి పాత్రలో నటించారు. ఇప్పుడు మరోసారి అంధుడి పాత్రను పోషించబోతున్నాడు.
 
క‌మ‌ల్ బిజినెస్ ట్రెండ్‌
సాధార‌ణంగా క‌మ‌ల్‌హాస‌న్ సినిమాలు బిజినెస్‌ప‌రంగా చాలా వీక్. 3 కోట్లు వ‌స్తే అదే గ్రేట్‌. తాజాగా విక్ర‌మ్ సినిమా త‌మిళంలో 70 కోట్లు, తెలుగులో 15 కోట్లు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో 15 కోట్లు వ్యాపారం జ‌రిగింద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇందుకు జాతీయ‌స్థాయి న‌టులు క‌లిసి సినిమా చేయ‌డ‌మే విశేష‌మంగా ట్రేడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బేన‌ర్‌పై రూపొందుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన “విక్రమ్” చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని యోచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments