Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రివిక్రమ్ ప్రారంభించిన సిద్దు జొన్నలగడ్డ చిత్రం

Advertiesment
Sidhu Jonnalagadda Movie
, బుధవారం, 7 జులై 2021 (12:35 IST)
Trivikram clap
వరుస చిత్రాల నిర్మాణంలోనేకాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' నిర్మిస్తున్న నూతన చిత్రం (ప్రొడక్షన్ నంబర్ 9) బుధ‌వారం సంస్థ కార్యాలయంలో ఉదయం  పూజా కార్యక్రమాల తో ప్రారంభమైంది.
 
ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ దేవతామూర్తుల ముందు క్లాప్ నివ్వడం తో చిత్రం ప్రారంభ మయింది. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు)స్క్రిప్టును చిత్ర దర్శకుడుకి అందించారు.
 
webdunia
Siddu, Radhakrishna etc
సిద్దు జొన్నలగడ్డ ప్రధాన నాయకుడు గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు తెలుగులో ఇదే తొలి చిత్రం. శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకుడు గా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు.
 
గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. 'ప్రేమ' లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టి. రమేష్. ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతరపాత్రల్లో నటీ నటులు ఎవరన్నది త్వరలో ప్రకటించటం జరుగుతుంది.
 
సాంకేతిక నిపుణులు:
ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు
సంగీతం: స్వీకార్ అగస్తి
మాటలు: గణేష్ కుమార్ రావూరి
ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై
పి.ఆర్.ఓ: యల్.వేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవితా రాజశేఖర్ ప్రాపర్టీని ఉపాసన తీసుకుంటున్నారా?