Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ‌క‌థా చిత్రమ్ 2 హిందీ శాటిలైట్ రైట్స్ ఎంతో తెలుసా..?

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (14:06 IST)
ప్రేమ కథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్‌ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2. ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇన్నాని జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి కోటి 43 ల‌క్ష‌లకు శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ను ద‌క్కించుకుంది. 
 
ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ "ప్రేమ కథా చిత్రం 2" సినిమా మెద‌టి లుక్‌ని విడుద‌ల చేసుకుంది. సినిమా షూటింగ్ పూర్త‌యింది. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మొద‌టి పార్ట్‌కి ధీటుగా వ‌స్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా న‌ట‌న సూపర్ ప్ల‌స్ అవుతుంది.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ... ప్రేమ క‌థా చిత్ర‌మ్ ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలుసు. అదే హ‌వాని ట్రేడ్లో సీక్వెల్‌గా వ‌స్తున్న ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 కూడా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. హిందీ శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్‌ని కోటీ న‌ల‌భై మూడు ల‌క్ష‌ల‌కి కొనుగొలు చేశారు. అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా, సిధ్ధి ఇద్నాని మ‌రో హీరోయిన్‌గా చేస్తున్నారు. విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీనుల మ‌ధ్య వ‌చ్చే కామెడి ఆక‌ట్ట‌కుంటుంది. జ‌న‌వ‌రిలో విడుదల కానున్న ఈ చిత్రం యెక్క టీజ‌ర్‌ని అతి త్వ‌ర‌లో విడుదల చేస్తాం. పూర్తి స‌ర్‌ప్రైజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న మా  ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments