Webdunia - Bharat's app for daily news and videos

Install App

60 మిలియన్ వ్యూస్ తో రికార్డు `పుష్ప` ఇంట్రడక్షన్ వీడియో

Webdunia
మంగళవారం, 4 మే 2021 (16:40 IST)
Pupsha intraduction
అల్లు అర్జున్ కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈయన పుష్ప సినిమాలో నటిస్తున్నారు. బబ్లీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సంచలన దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి చెందిన పుష్ప ఇంట్రడక్షన్ వీడియో యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పుష్ప రాజ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో కు అద్భుతమైన స్పందన వస్తుంది.

విడుదలైన క్షణం నుంచి రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతుంది. తెలుగు ఇండస్ట్రీ లో అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియో గా అల్లు అర్జున్ పుష్ప చరిత్ర సృష్టించింది. 1.4 మిల్లియన్ లైకులతో పాటు లక్ష పైన కామెంట్స్ కూడా ఈ వీడియో కు రావడం విశేషం. ఈ వీడియో లో దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. సినిమాకు సంబందించిన మరిన్ని విశేషాలను త్వరలోనే ప్రేక్షకులకు తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments