దీపికా పడుకునే ఇంట్లో అందరికీ కోవిడ్ పాజిటివ్...

Webdunia
మంగళవారం, 4 మే 2021 (15:58 IST)
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి వీఐపీలను, సెలబ్రిటీలను వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఇంట్లో అందరూ కొవిడ్ పాజిటివ్‌గా తేలారు. 
 
ఆమె తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకునే, ఆమె తల్లి ఉజాలా, చెల్లెలు అనీషాలకు కరోనా సోకింది. ఇండియా తరఫున తొలిసారి ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ (1980లో) గెలిచిన 65 ఏళ్ల ప్రకాశ్ పదుకోన్ ప్రస్తుతం బెంగళూరులోని హాస్పిటల్‌లో కోలుకుంటున్నారు.
 
పది రోజుల కిందట ఇంట్లో అందరికీ స్వల్ప లక్షణాలు కనిపించాయని, దీంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ప్రకాశ్ సన్నిహితుడు, ఆయన బ్యాడ్మింటన్ అకాడమీ డైరెక్టర్ విమల్ కుమార్ చెప్పారు. 
 
వారం రోజులు ఇంట్లోనే ఉన్నా ప్రకాశ్‌కు జ్వరం తగ్గకపోవడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేసినట్లు తెలిపారు. మరోవైపు దీపికా తల్లి, చెల్లులు ఇంట్లోనే కోలుకుంటున్నారు.
 
ప్రకాశ్ పదుకోన్ 1970, 80ల్లో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఓ వెలుగు వెలిగాడు. ఇండియా తరఫున ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలవడమే కాకుండా 1983లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ బ్రాంజ్ మెడల్ గెలిచాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - మావోయిస్టుల హతం

తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి: తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులు

Exit polls, జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్, బీహారులో ఎన్డీయే

ఐఏఎస్ అధికారిణికి తప్పని వేధింపులు - ఐఏఎస్ భర్తపై ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments