ఏపీ సిఎం రిలీఫ్ ఫండ్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ కోటి రూపాయల భారీ విరాళం

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (11:54 IST)
సాయం చేయడంలో ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. తాజాగా మరోసారి ఇదే చేసారు. ఆంధ్రప్రదేశ్‌ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే.

 
ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నారు. తాజాగా ప్రభాస్ కూడా అనౌన్స్ చేసారు. ఈయన కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడా ఈయన భారీగానే విరాళాలు అందచేసారు.

 
హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించారు ప్రభాస్. ఇక కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. ఇలా అవసరం అనుకున్న ప్రతీసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు రెబల్ స్టార్. ఈయన పెద్ద మనసుకు అభిమానులతో పాటు అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు నగరంలో 100 పడకల ఈసీఐ ఆస్పత్రి- మంత్రి శోభా కరంద్లాజే

శెభాష్ నాయుడు... క్లిష్ట సమయంలో మీ పనితీరు సూపర్ : ప్రధాని మోడీ కితాబు

ఆహా... ఏం రుచి... అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ

Davos: జనవరి 19 నుంచి జనవరి 23 వరకు చంద్రబాబు దావోస్ పర్యటన

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్లను వద్దనే వద్దంటున్న కంపెనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments