Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరిలో అక్క.. ప్రచారానికి దూరంగా ఎన్టీఆర్... అది బయటకు పొక్కకూడదనే...

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:30 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో దివంగత నటుడు నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి వెంకట సుహాసిని పోటీచేస్తున్నారు. ఈమె హైదరాబాద్‌ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆమె విజయం కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, హీరోలు బాలకృష్ణ, తారకరత్న వంటివారు ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆమె సోదరుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు కూడా పాల్గొంటారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ, వారిద్దరూ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. 
 
అయితే, ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటానికి గల కారణాలు ఏంటో ఇపుడు బహిర్గతమయ్యాయి. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీస్తున్న చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మెగా హీరోగా కూడా ఉన్నారు. ఈ చిత్రం కోసం జూనియర్ ఎన్టీఆర్ బాగా బరువు పెరుగుతున్నారట. 
 
అందుకు సంబంధించిన ఓ ఫోటో కూడా వైరల్ అవుతోంది. దాదాపు 100 కేజీలకు పైగా బరువుతో ఉన్న ఎన్టీఆర్.. తన లుక్‌ రివీల్ కాకూడదన్న జక్కన్న సూచనతోనే బయటకు రావడం లేదని అంటున్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ సోదరిని గెలిపించాలని నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్, తారక్‌లిద్దరూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments