Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RDXLove.. పాయల్ విశ్వరూపం.. ట్రైలర్ అదిరిందిగా.. (Trailer)

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (17:37 IST)
ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారును కట్టిపడేసిన పాయల్ రాజ్ పుత్.. తాజాగా ఆర్డీఎక్స్ లవ్ పేరిట సినిమా చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. తొలి టీజర్‌లో మొత్తం రొమాన్స్‌కే పరిమితమైన పాయల్ రాజ్ పుత్.. మళ్లీ గ్లామర్ కోసమే ఇందులో నటించింది కాబోలు అని అందరూ అనుకున్నారు. 
 
కానీ ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌ను చూస్తే మాత్రం పాయల్ మంచి కథ, సూపర్ రోల్ చేసేందుకే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ట్రైలర్‌లో పాయల్ యాక్షన్ హీరోయిన్ అవతారం ఎత్తింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ బోల్డ్‌గా ఉండటంతో పాయల్‌పై విమర్శలు కూడా వచ్చాయి. కానీ మళ్లీ అదే తప్పు చేయకుండా స్టోరీ చుట్టూ కథను నడిపేలా సినీ దర్శకనిర్మాతలు ట్రైలర్‌ను కట్ చేశారు. 
 
అనగనగ ఒక ఊరు.  ఆ ఊరికి ఓ సమస్య ఉన్నది. ఆ సమస్యను పరిష్కరించేందుకు గ్రామం మొత్తం ఏకం అవుతుంది. అదే సమయంలో పాయల్ రాజ్‌పుత్ ఎంట్రీ ఇస్తుంది. సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగుతుంది. ఇంత అందమైన అమ్మాయిలకు ఇంత రిస్కీ జాబ్ అవసరమా?, వేటాడాలనుకునే మగాడికి లేడిపిల్లలా కనిపించవచ్చు. 
 
కానీ అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి మగ సింహం కూడా కుక్కపిల్లలా కనిపిస్తుంది, క్యారెక్టర్ వున్న ఆడదాని మాటే అగ్రిమెంట్ రా, అమ్మాయిలతో మాట్లాడాలంటే.. నిజం చెప్పి బతిమాలండి కరిగిపోతారు. అంతేగానీ అబద్ధం చెప్పి బాధపెట్టకండి.. కరిగించేస్తారు.. అంటూ చివరిగా పాయల్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments