Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 11న విశాల్‌ లేటెస్ట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు' ఆడియో

Webdunia
మంగళవారం, 3 మే 2016 (13:02 IST)
మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా, శ్రీదివ్య కథానాయికగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో డిఫరెంట్‌ సినిమా అవుతుంది. డైరెక్టర్‌ ముత్తయ్య చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకుముందు నేను చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఈ చిత్రంలో నా గెటప్‌ వుంటుంది. ఆల్‌ క్లాసెస్‌ ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసే అన్ని ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి'' అన్నారు. 
 
'రాయుడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ - ''ఇటీవల రిలీజ్‌ చేసిన 'రాయుడు' ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. విశాల్‌ కెరీర్‌లోనే చాలా డిఫరెంట్‌ ఫిల్మ్‌ అవుతుందన్న అప్రిషియేషన్‌ వస్తోంది. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదలైంది. మే 11న ఈ చిత్రం ఆడియోను విడుదల చేస్తున్నాం. మే 20న 'రాయుడు' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి'' అన్నారు. 
 
మాస్‌ హీరో విశాల్‌, శ్రీదివ్య, రాధారవి, సూరి, ఆర్‌.కె.సురేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌, సంగీతం: డి.ఇమాన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఫైట్స్‌: అనల్‌ అరసు, డాన్స్‌: బాబా భాస్కర్‌, సమర్పణ: విశాల్‌, దర్శకత్వం: ముత్తయ్య.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్ ఇక ఉదయం 7 గంటల నుంచి పనిచేస్తుంది..

వంశీకి ఫిట్స్ - ఆస్తమా సమస్యలున్నాయ్... పనిష్మెంట్ సెల్‌లో ఉంచారు : పంకజశ్రీ

Botsa Satyanarayana: పయ్యావుల పద్దు పనికిరాదు.. బొత్స సత్యనారాయణ

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments