పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ చిత్రం చేయాలని ఉందనీ హీరో రవితేజ అంటున్నారు. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ సూపర్బ్‌గా ఉంటుందన్నారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం "రాజా ది గ్రేట్". చాలా గ్యాప్ తర
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ చిత్రం చేయాలని ఉందనీ హీరో రవితేజ అంటున్నారు. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ సూపర్బ్‌గా ఉంటుందన్నారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం "రాజా ది గ్రేట్". చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత 'టచ్ చేసి చూడు' సినిమాపై దృష్టి పెట్టిన ఆయన, మరో రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు.
ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో "తెలుగులో ఏ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఇష్టపడతారు?" అనే ప్రశ్న ఆయనకి రవితేజ సమాధానమిస్తూ "పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలని ఉంది. ఆయన కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చుతుంది. మా ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందనేది నా అభిప్రాయం" అంటూ బదులిచ్చారు.