Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లో మాత్రమే మద్యం సేవిస్తాను. డ్రగ్స్ అలవాటు లేదు. పూరీ అంటే ఎంతో ఇష్టం: రవితేజ

తనకు మద్యం అలవాటు మాత్రమే ఉందని, అది కూడా వారాంతాల్లో తన ఇంట్లో లేదా స్నేహితుల ఇళ్లలోనే మద్యం సేవిస్తానని టాలీవుడ్ హీరో రవితేజ స్పష్టం చేశారు. శుక్రవారం సిట్ విచారణకు హాజరైన రవితేజ ఎక్కడా తడబాటు లేకుంటా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కాకుం

ఇంట్లో మాత్రమే మద్యం సేవిస్తాను. డ్రగ్స్ అలవాటు లేదు. పూరీ అంటే ఎంతో ఇష్టం: రవితేజ
హైదరాబాద్ , శనివారం, 29 జులై 2017 (04:15 IST)
తనకు మద్యం అలవాటు మాత్రమే ఉందని, అది కూడా వారాంతాల్లో తన ఇంట్లో లేదా స్నేహితుల ఇళ్లలోనే మద్యం సేవిస్తానని టాలీవుడ్ హీరో రవితేజ స్పష్టం చేశారు. శుక్రవారం సిట్ విచారణకు హాజరైన రవితేజ ఎక్కడా తడబాటు లేకుంటా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కాకుండా ఎదురు ప్రశ్నలు వేస్తూ తమాషా చేసినట్లు తెలుస్తోంది. పైగా డ్రగ్స్ అంటేనే తెలీదు ఇక వాటిని వాడటం కూడానా అంటూ రవితేజ అడ్డుప్రశ్నలు వేసినట్లు సమాచారం.
 
డ్రగ్స్‌ వ్యవహారంలో కీలక నిందితులైన జీశాన్, కెల్విన్‌లతో సంబంధాలకు సంబంధించి హీరో రవితేజపై ఎక్సైజ్‌ సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. జీశాన్‌తో ఎనిమిదేళ్లుగా పరిచయముందని, అతడి నుంచి డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా తమకు సమాచారముందని కాల్‌డేటా ఆధారంగా నిలదీసినట్లు సమాచారం. అయితే తనకు అసలు డ్రగ్స్‌ అలవాటు లేదని రవితేజ పేర్కొన్నట్లు తెలిసింది. జీశాన్‌ ఎవరో తనకు తెలియ దని, కెల్విన్‌ మాత్రం ఈవెంట్‌ మేనేజర్‌గా పరిచయమని పేర్కొన్నట్లు సమాచారం.
 
శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సిట్ కార్యాలాయానిక చేరుకున్న రవితేజను సిట్ అధికారులు మధ్యలో రెండు విరామాలతో రాత్రి 7.30 గంటల వరకు విచారించారు. డ్రగ్స్ వ్యాపారి జీశాన్‌తో మీకు ఏనిమిదేళ్లుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోందని, అతను మీకు డ్రగ్స్ సరఫరా చేశాడని స్పష్టంగా తమ విచారణలో వెల్లడైందని సిట్ ప్రశ్నించగా జీశానా 
అనగా ఎవరు అనే రేంజిలో రవితేజ కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది. 
 
డ్రగ్ రాకెట్లో సంబంధం ఉన్న కెల్విన్‌ మాత్రం ఈవెంట్‌ మేనేజర్‌గా తెలుసని, తాను నటించిన పలు సినిమాలకు ఈవెంట్లు చేయడంతో పరిచయమని రవితేజ పేర్కొన్నట్లు సమాచారం. అంతేతప్ప వారి ద్వారా తాను డ్రగ్స్‌ ఏమీ తీసుకోలేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. గతంలో భరత్‌పై డ్రగ్స్‌ ఆరోపణల సందర్భంలో మీ పేరు కూడా వినిపించిందని సిట్‌ అధికారులు ప్రశ్నించగా... తాను డ్రగ్స్‌ దందా చేసి ఉంటే అప్పుడే పోలీ సులు తనను అరెస్ట్‌ చేసేవారు కదా అని రవితేజ పేర్కొన్నట్లు తెలిసింది. పైగా డ్రగ్స్ వ్యవహారంలో సొంత తమ్ముడినే దూరం చేసుకున్నానని చెప్పారు.
 
‘పూరి మీకు డ్రగ్స్‌ అలవాటు చేసినట్టుగా సందేహాలున్నాయి. ఆయనతో మీరు సన్నిహితంగా ఉంటారు దానికి కారణం డ్రగ్స్‌ వాడుతుండటమేనా..’’ అంటూ సిట్‌ అధికారులు ప్రశ్నించగా రవితేజ భావోద్వేగంతో సమాధానమిచ్చారట. తన సినీ జీవితంలో తనకు ఇష్టమైన వ్యక్తి పూరి  అని.. తన కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి పూరితో కలసి తీసిన సినిమాలే తోడ్పడ్డాయని రవితేజ పేర్కొన్నట్లు సమాచారం. తనకు డ్రగ్స్‌ వాడాల్సిన అవసరం లేదని.. సినిమాలు, కుటుంబం తప్ప మరో ధ్యాస లేదని చెప్పినట్టు సమాచారం. 
 
తనకు మద్యం అలవాటు మాత్రమే ఉందని, అది కూడా వారాంతాల్లో తన ఇంట్లో లేదా స్నేహితుల ఇళ్లలోనేనని చెప్పినట్టు సమాచారం. కాగా రాత్రి 7.30 గంటల సమయంలో రవితేజకు సంబంధించిన విచారణ ముగిసింది. కాగా.. విచారణ అనంతరం పరీక్షల నిమిత్తం రక్తం, గోళ్లు తదితర నమూనాలు ఇచ్చేందుకు రవితేజ నిరాకరించారని సిట్‌ అధికారులు తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో భారీ డ్రగ్ రాకెట్: రెండు జిల్లాల్లో 600 కిలోల మాదకద్రవ్యాల పట్టివేత