Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ - నక్కిన కాంబోలో ధమాకా.. ఫస్ట్ లుక్ రిలీజ్

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (10:25 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన నటుడు రవితేజ, జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆయన సినిమాలు చేస్తుంటారు. గత యేడాది సంక్రాంతికి క్రాక్‌గా వచ్చి సూపర్ హిట్ కొట్టారు. 
 
ఆ తర్వాత ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ అనే సినిమాను ప్రారంభించారు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుంటే, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. 
 
ఇదిలావుంటే, శరత్ మందవా అనే దర్శకుడితో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రాం కూడా చేస్తున్నాడు ర‌వితేజ‌. ఇది కూడా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇక ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన ద‌ర్శ‌కత్వంలో ర‌వితేజ హీరోగా ధమాకా పేరుతో ఓ చిత్రం రానుంది. 
 
ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విజయదశమి పండుగను పురస్కరించుకుని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో 20 ఏళ్ల కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందట. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ.70 లక్షలు రెమ్యూనరేషన్ ఇవ్వజూపినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments