"అన్నాత్తే" ట్రైలర్.. తలైవా ఫ్యాన్స్‌కు మస్తు మజా (video)

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (22:50 IST)
సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శివ కాంబోలో "అన్నాత్తే" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాలో కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, ఖుష్బు, మీనా, జగపతి బాబు, సూరి, సతీష్, దర్శకుడు బాల సోదరుడు శివ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నయనతార కథానాయికగా నటించిన రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ 4 నవంబర్ 2021న విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. డి ఇమ్మాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు.
 
అందరూ ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ గత నెల వినాయక చతుర్థి సందర్భంగా లాంచ్ అయ్యింది. రెండు పోస్టర్లకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి భారీ స్పందన వచ్చింది. ఇక చెప్పినట్లుగానే ఈరోజు మేకర్స్ సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘అన్నాత్తే’ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది. 
 
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. రజినీ లుక్, యాక్షన్ సన్నివేశాలు… ఇది పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఫీస్ట్ అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. మొత్తానికి ఈ దీపావళికి సూపర్ స్టార్ బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటారని టాక్ వస్తోంది. తాజాగా రిలీజైన ట్రైలర్‌ను ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ నగర నడిబొడ్డున ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహం

సిద్ధరామయ్య ఇంట్లో అల్పాహార సమావేశం.. కావేరికి చేరిన డీకే శివకుమార్

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments