Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ 'రాబిన్‌ హుడ్‌' ఫిక్సయ్యాడు

Webdunia
గురువారం, 5 మే 2016 (20:05 IST)
రవితేజ నటించే తాజా చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. ఆయన నటిస్తున్న 'ఎవడో ఒకడు'కు బ్రేక్‌ పడింది. దాంతో చక్రి దర్శకత్వంలో 'రాబిన్‌ హుడ్‌' సినిమా చేస్తున్నట్టుగా రవితేజ ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆయన అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన విషయాలేవీ ఈ మధ్యలో బయటికి రాలేదు. 
 
తాజాగా రాశీఖన్నా తను ఈ చిత్రంలో చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో చిత్రం ఖారారయినట్లుగా తెలిసిపోయింది. 'రాబిన్‌ హుడ్‌' సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయనీ, జూన్‌లో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ సిక్స్‌ ప్యాక్‌తో కనిపిస్తాడనీ, ఆయన పాత్రను చక్రి వైవిధ్యభరితంగా తీర్చిదిద్దాడని చెబుతున్నారు. కొత్త దర్శకుడితో రవితేజ చేయనున్న ఈ సినిమా రవితేజకు పూర్వవైభవం చేకూరుతుందేమో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD: మే 23-27 వరకు ఐదు రోజుల పాటు వర్షాలు- 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

అత్యాచారం కేసులో జైలు నుంచి విడుదలై సంబరాలు చేసుకున్న నిందితులు!!

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

మాకు నీటిని ఆపితే.... మేము మీ శ్వాసను ఆపేస్తాం : భారత్‌కు పాకిస్థాన్ హెచ్చరిక

భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments