Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజ‌వాడలో 'సరైనోడు'... ఉఫ్ ఉఫ్ అనుకుంటూ రకుల్-కేథరిన్ మధ్య బన్నీ...

బాబోయ్... ఈ బెజ‌వాడ‌లో ఎండ‌లు ఏంటి... ఇక్క‌డ ఎండ‌లు హాటే... యూత్ హాటే... అంటూ బ‌న్నీ ఇబ్బందిప‌డిపోయాడు. విజ‌య‌వాడ‌లో స‌రైనోడు మూవీ విజ‌యోత్స‌వంలో బ‌న్నీ ఎందుకో చాలా అస‌హ‌నంగా ఫీల్ అయ్యాడు. ఒకప‌క్క ఉక్క‌పోత‌... మ‌రోప‌క్క ఏర్పాట్ల‌లో నిర్వాహ‌కుల వైఫ‌ల్

Webdunia
గురువారం, 5 మే 2016 (18:29 IST)
బాబోయ్... ఈ బెజ‌వాడ‌లో ఎండ‌లు ఏంటి... ఇక్క‌డ ఎండ‌లు హాటే... యూత్ హాటే... అంటూ బ‌న్నీ ఇబ్బందిప‌డిపోయాడు. విజ‌య‌వాడ‌లో స‌రైనోడు మూవీ విజ‌యోత్స‌వంలో బ‌న్నీ ఎందుకో చాలా అస‌హ‌నంగా ఫీల్ అయ్యాడు. ఒకప‌క్క ఉక్క‌పోత‌... మ‌రోప‌క్క ఏర్పాట్ల‌లో నిర్వాహ‌కుల వైఫ‌ల్యం అల్లు అర్జున్‌ని ఇబ్బంది పెట్టింది. విజ‌య‌వాడ‌లోని సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్స్‌లో స‌రైనోడు ఫంక్ష‌న్ ఘ‌నంగా జ‌రిగింది. చిత్ర నిర్మాత అల్లు అర‌వింద్, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు. 
 
మే నెలలో మండుటెండ కాచాక‌... సాయంత్రం ఇద్ద‌రు హీరోయిన్లు ర‌కుల్ ప్రీతి సింగ్, కేథ‌రిన్‌ల మ‌ధ్య ఉక్క‌పోత‌తో ఉఫ్ ఉఫ్ అంటూ బ‌న్నీ ప్రోగ్రాం వేడిని భ‌రించాడు. అక్క‌డికీ బ‌న్నీ ప‌ల‌ుచ‌టి కాట‌న్ చొక్కా క్యాజువ‌ల్‌గా వేసుకువ‌చ్చాడు. ఐనా చమ‌ట‌ల‌కు చిరాక‌నిపించింది మ‌న హీరోకి. ఇక గ్రౌండ్లో స‌రైన సీటింగ్ లేక‌పోవ‌డంతో, ప్రేక్ష‌కులు, అభిమానుల తొక్కిస‌లాట అస‌హ‌నాన్ని క‌లిగించింది.
 
అయినా, భారీ సంఖ్య‌లో వ‌చ్చిన అభిమానుల్ని చూసి, బ‌న్నీ అంత ఉక్క‌లోనూ ఉబ్బిత‌బ్బిబయ్యాడు. బెజ‌వాడ హాట్... ఇక్క‌డి యూత్ హాట్ అంటూ.. ఏంటో ఇక్క‌డ మాట్లాడాలంటే టెన్ష‌న్ వ‌చ్చేస్తోంద‌ని స్పీచ్ స్టార్ట్ చేశాడు. న‌న్ను ఊర మాస్‌గా చూపించిన బోయ‌పాటి శ్రీనుకు అభినంద‌న‌లని తెలిపాడు. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన హీరోయిన్... కేథ‌రిన్ మా ఎమ్మెల్యే అంటూ... ఈమెతోనే వ‌రుస‌గా మూడు సినిమాలు చేశా. ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రితోనూ చేయ‌లేద‌న్నాడు బ‌న్నీ. మ‌రో ప‌క్క‌న ఉన్న ర‌కుల్ ప్రీతి సింగ్ కూడా త‌న‌కు ఇష్టమే అని, త‌న‌లోని దేశభ‌క్తి త‌న‌ను ఎంతో ఆక‌ట్టుకుంద‌న్నారు.
 
రూపాయిన్న‌ర‌కి మూడు రూపాయ‌లు పిండేశారు... డాడీ!
నాకు డాడీగా కాదు... ఒక నిర్మాత‌గా అల్లు అర‌వింద్ గారిని అభినందిస్తున్నా అన్నాడు బ‌న్నీ. మామూలుగా ప్రొడ‌క్ష‌న్లో రూపాయికి రూపాయే ఖ‌ర్చు పెట్టే డాడీ... త‌న సినిమాకి రూపాయికి రూపాయిన్న‌ర ఖ‌ర్చు చేశార‌ని... ఇదేంటి డాడీ ఇంత ఎందుకు ఖ‌ర్చు చేస్తున్నావంటే... మూడు రూపాయ‌లు సంపాదించేస్తా అనే ధీమాతోనే డ‌బ్బు పెడుతున్నా అన్నార‌ని నిర్మాత డాడీ... అల్లు అర‌వింద్‌ని కొనియాడారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments