మ‌రో కొత్త ప్రాజెక్ట్‌లో పోలెండ్ వెళ్ళిన ర‌వితేజ‌

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (12:59 IST)
Ravi Teja
ఇప్పటికే ధమాకా, రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు, చిరంజీవితో భోళాశంక‌ర్ వంటి సినిమాల‌తో బిజీగా వున్న మాస్ ర‌వితేజ తాజాగా మ‌రో సినిమా చేస్తున్నాడు. నిమాటోగ్రాఫర్ కార్తీక్ గడ్డంనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవ‌లే పోలాండ్‌లో ప్రారంభ‌మైంది. మ‌రో రెండు వారాల‌పాటు అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ఉంటుందనీ, దాని తర్వాత దేశంలోనే మరో అవుట్‌డోర్ షెడ్యూల్ ఉంటుంద‌ని యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
 
పేరు పెట్టని ఈ సినిమాలో ర‌వితేజ స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నారు. డార్క్ కామెడీ ఫ్లేవర్‌తో యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ఇందులో పెద్ద‌గా పాట‌లు కూడా వుండ‌వ‌ని తెలుస్తోంది. . యాక్షన్ పార్ట్ ప్రత్యేకంగా నిలుస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ (ఏక్ మినీ కథ ఫేమ్),  నవదీప్ న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments