Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ - రామారావు ఆన్ డ్యూటీ చివరి షెడ్యూల్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (18:02 IST)
Rama Rao on duty
రవితేజ న‌టిస్తోన్న‌ `రామారావు ఆన్ డ్యూటీ` సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించేందుకు టీం రెడీగా ఉంది. 
 
ఈ ఫైనల్ షెడ్యూల్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించనున్నారు. భారతదేశంలోని కొన్ని లొకేషన్లలో ఈ సీన్స్‌ను షూట్ చేయనున్నారు. యూరోప్‌లోని అందమైన లొకేషన్లలో పాటలను తెరకెక్కించనున్నారు. భారతదేశంలోని దట్టమైన అడవుల్లో ఈ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ చిత్రం ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. రవితేజ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం  తెరకెక్కుతోంది. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు.
 
సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
 
నటీనటులు : రవితేజ, దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తణికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు.
 
సాంకేతిక బృందంః కథ, కథనం, మాటలు, దర్వకత్వం : శరత్ మాండవ, నిర్మాత : సుధాకర్ చెరుకూరి, సంగీతం : సామ్, ,సీఎస్,  సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్ ఐఎస్‌సీ,  ఎడిటర్ : ప్రవీణ్ కేఎల్, ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments