విష్ణు విశాల్ మట్టి కుస్తీ ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేసిన రవితేజ

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (16:54 IST)
Vishnu Vishal
మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగానిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ'. ఆర్‌ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌ లపై రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.
 
ఈరోజు రవితేజ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను విడుదల చేశారు. పోస్టర్‌లో విష్ణు విశాల్ స్టార్ రెజ్లర్‌గా రింగ్‌లో బిగ్ ఫైట్ కి రెడీ అవుతున్నట్లుగా కనిపించారు. రెజ్లింగ్ డ్రెస్ లో, కండలు తిరిగిన శరీరంతో ఆకట్టుకున్నాడు విష్ణు విశాల్. మట్టి కుస్తీ  కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది.
 
ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు. మట్టి కుస్తీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌ లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
 
సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: చెల్లా అయ్యావు, నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్, డీవోపీ:  రిచర్డ్ ఎం నాథన్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, ఎడిటర్: ప్రసన్న జికె, ఆర్ట్ డైరెక్టర్: ఉమేష్ జే కుమార్,లిరిక్స్: వివేక్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments