Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణాసుర నన్ను మరో మెట్టు ఎక్కిస్తుంది : హర్షవర్ధన్ రామేశ్వర్

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (17:01 IST)
Music Director Harshvardhan Rameshwar
అర్జున్ రెడ్డి నా కెరీర్ కి పాత్ బ్రేకింగ్ ఫిల్మ్. అర్జున్ రెడ్డిని భెస్ చేసుకునే ఇప్పటికీ నన్ను సంప్రదిస్తున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత జార్జ్ రెడ్డిలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం దక్కింది. ఈ రెండు సినిమాల తర్వాత సంగీత దర్శకుడిగా రావణాసుర నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను అని సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అన్నారు. 
 
సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా 'రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ విలేఖరుల సమావేశంలో ‘రావణాసుర’ విశేషాలని పంచుకున్నారు.
 
సంగీత దర్శకుడు కాకముందు ఏం చేసేవారు ?
మాది రాజమండ్రి. చెన్నై లో స్థిరపడడం. మా నాన్న గారు ప్రముఖ రిధమ్ ప్లేయర్. ప్రముఖ సంగీత దర్శకుల వద్ద పని చేశారు. నేను రిధమ్ ప్లేయర్ గా కెరీర్ మొదలుపెట్టాను. తర్వాత ప్రోగ్రామింగ్ లో పని చేశా. కన్నడ లో హరి కృష్ణ గారి దగ్గర ఏడేళ్ళు పని చేశాను. తర్వాత జిబ్రాన్, రధన్, దేవగారు ఇలా చాలా మంది దగ్గర చేశాను. అర్జున్ రెడ్డి చేసినప్పుడు పాటలతో పాటు బీజీఎం కి చేశాను. సందీప్ గారు నా పని గుర్తించి స్క్రీన్ పై పేరు వేశారు.
 
రావణాసుర జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ?
అభిషేక్ గారి ప్రొడక్షన్ లో ‘డెవిల్’ సినిమా చేస్తున్నాను. అభిషేక్ గారు ఒక రోజు కాల్ చేసి రావణాసుర టైటిల్ ఎలా వుందని అడిగారు. చాలా పవర్ ఫుల్ టైటిల్ అని చెప్పాను. దీనికి థీమ్ సాంగ్ కావాలని కొన్ని వివరాలు చెప్పారు. ఒక ట్యూన్ చేసి పంపించాను. కొన్ని రోజులు తర్వాత ఒక రోజు స్టూడియోకి అభిషేక్ గారు, సుధీర్ వర్మ గారు వచ్చారు. రావణాసురకి నువ్వే మ్యూజిక్ చేస్తున్నావని చెప్పారు. నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. వెంటనే మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో రవితేజ గారు హీరో అని చెప్పారు. నా మైండ్ బ్లాంక్ అయిపొయింది. రవితేజ గారికి పెద్ద ఫ్యాన్ ని. రవితేజ గారి సినిమాకి పని చేయడం డ్రీమ్ కం ట్రూ మూమెంట్.
 
రావణాసురకి ఇద్దరు సంగీత దర్శకులు పని చేశారు కదా.. వర్క్ ని ఎలా డివైడ్ చేసుకున్నారు ?
నేను రావణాసురలో నాలుగు పాటలు తో పాటు నేపధ్య సంగీతం చేశాను. భీమ్స్ గారు ఒక ఐటెం సాంగ్ చేశారు.
 
రావణాసురకి స్పెషల్ మ్యూజిక్ వర్క్ ఉందా ?
రావణాసుర సినిమా మొత్తం స్పెషల్ గా వుంటుంది. సుధీర్ వర్మగా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సౌండింగ్ కొత్తగా వుండాలని ఎదురుచూస్తారు. రావణాసుర కి వర్క్ చేయడం ఛాలెజింగా అనిపించింది. సాంగ్స్ , నేపధ్య సంగీతం చాలా కొత్తగా చేయడం జరిగింది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారు.
 
రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించిది ?
రవితేజ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన ఇచ్చే సలహాలు సూచనలు చాలా ఇన్నోవేటివ్ గా వుంటాయి.  వెయ్యినొక్క జిల్లాల వరకు రీమిక్స్ చేసినప్పుడు ఒక చోట స్ట్రింగ్ వాయిద్యం వాడను. రవితేజ గారు అక్కడ విజల్ సౌండ్ వాడితే బావుంటుందని చెప్పారు. నిజంగా అది చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. సినిమా థీమ్ గ్లింప్స్ లో కూడా విజల్ వుంటుంది. అలా అది గొప్పగా కనెక్ట్ అయ్యింది.
 
వెయ్యినొక్క జిల్లాల  పాట రీమేక్ చేయడం ఎలా అనిపించింది ?  
ఇళయరాజా గారి పాటని రీమిక్స్ చేయడం ఒక సవాల్ తో కూడుకున్నది. కష్టంతో కూడుకున్న పని. రాజా గారు దీనిని మేజర్ స్కేల్ లో చేశారు. నేను రవితేజ గారి ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని  మైనర్ స్కేల్ లో ఒక ట్యూన్ చేశాను. అది అందరికీ నచ్చింది.  ఈపాట రీమేక్ చేయడానికి కారణం.. కథలో ఆ సందర్భం వుంది.
 
సుధీర్ వర్మ గారితో పని చేయడం ఎలా అనిపించిది ?
సుధీర్ వర్మ గారు సౌండ్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా వుంటారు. తనకి ఏం కావాలో చాలా క్లారిటీగా వుంటారు. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా అడుగుతారు. దీంతో డిఫరెంట్ గా చేసే స్కోప్ దొరికింది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది.
 
రవితేజ గారు అంటే మాస్.. కానీ రావణాసుర థ్రిల్లర్.. ఈ రెండుని ఎలా బ్యాలెన్స్ చేశారు ?
 రావణాసురలో ఈ రెండూ అద్భుతంగా కుదిరిరాయి. కథ బావుంటే ఆటోమేటిక్ గా మ్యూజిక్ ఫ్లో అవుతుంది. రావణాసురకి క్రియేటివిటీ ఫ్లో అయ్యింది.
 
మీ బలం ఏమిటి ? పాటలా నేపధ్య సంగీతమా ?
రెండూ. నిజానికి నేను పాటలే ఎక్కువ కంపోజ్ చేసేవాడిని. అర్జున్ రెడ్డి తర్వాత మాత్రం అది రివర్స్ అయ్యింది.
 
మీ ఫేవరట్ జోనర్ ఏమిటి ?
అన్ని జోనర్స్ కి పని చేయాలని వుంటుంది. సంగీతానికి స్కోప్ వుండి, డిఫరెంట్ గా మ్యూజిక్ చేసే అవకాశం వున్న సినిమాలు చేయాలని వుంటుంది.
 
కొత్తగా చేస్తున్న సినిమాలు ?
కళ్యాణ్ రామ్ గారి డెవిల్, సందీప్ గారి యానిమల్ సినిమాలకి పని చేస్తున్నా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bapatla: భర్త తలపై కర్రతో కొట్టి ఉరేసి చంపేసిన భార్య

వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు చేసిన రైల్వే పోర్టర్... ఎక్కడ?

చనిపోయిన పెంపుడు శునకం... ఆత్మహత్య చేసుకున్న యజమాని.. ఎక్కడ?

నోటీసులు ఇవ్వకుండానే అలాంటి భవనాలు కూల్చివేయొచ్చు : హైడ్రా కమిషనర్

3 గంటలు ఆలస్యమైతే విమానం రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments