Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యక్తిగా కూడా ఆయన చాలా స్ఫూర్తిదాయకం : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah
, మంగళవారం, 21 మార్చి 2023 (15:40 IST)
Faria Abdullah
జాతి రత్నాలు లో  లాయర్ పాత్ర చేశా.. ఇప్పుడు రావణాసుర కథకు లాయర్ అవసరం. లాయర్ పాత్ర కోసం కొంత ప్రిపరేషన్ చేశా. కోర్టులో తక్కువ సీన్స్ వుంటాయి. లాయర్ నేపధ్యం కీలకంగా వుంటుంది. మ్యారీడ్ విమన్. బాడీ లాంగ్వేజ్ లో కూడా కొంచెం పరిణితి వుండాలి. మైండ్ సెట్ కొంచెం భిన్నంగా వుండాలి అని ఫరియా అబ్దుల్లా అన్నారు. 
 
రవితేజ  మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌ పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా 'రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్స్ లో ఒకరైన ఫరియా అబ్దుల్లా విలేఖరుల సమావేశంలో రావణాసుర విశేషాలని పంచుకున్నారు.
 
 - రావణాసుర లో నా పాత్ర పేరు కనకమహాలక్ష్మీ. తను లాయర్. అయితే జాతిరత్నాలు లాంటి లాయర్ కాదు. చాలా సీరియస్ లాయర్. రవితేజ గారు సీనియర్ లాయర్. క్యారెక్టర్ లో చాలా వెరైటీ కలర్స్ వుంటాయి. కథ తో పాటు మారే పాత్ర.
 
- ఇందులో మొత్తం ఐదు మంది హీరోయిన్స్ వున్నారు. మేఘా ఆకాష్ తో మాత్రమే కాంబినేషన్ సీన్స్ వున్నాయి. ఐదు హీరోయిన్స్ ఉన్నప్పటికీ అందరికీ భిన్నమైన పాత్రలు. కథలో కీలకమైన పాత్ర చేశాను. నటించడానికి ఆస్కారం వుండే పాత్ర.
 
 - ఇందులో  బ్రేకప్ సాంగ్ కథలో ఒక ఫ్లాష్ బ్యాక్ పాయింట్ లో వచ్చే సాంగ్ అది. ఆ సాంగ్ షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా. 
 
- రవితేజ గారితో పని చేయడం నెక్స్ట్ లెవల్ ఎక్స్ పీరియన్స్. నటుడిగానే కాదు వ్యక్తిగా కూడా ఆయన చాలా స్ఫూర్తిదాయకం. బ్రేక్ లో కాసేపు ఆయనతో మాట్లడితే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
 
- రైటర్ శ్రీకాంత్ ఈ కథని చెప్పారు. విన్నప్పుడు చాలా ఎక్సయిటింగా అనిపించింది. దర్శకుడు సుధీర్ వర్మ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. 
 
- రావణాసురలో సీత ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అప్పటివరకూ సస్పెన్స్. 
 
- రవితేజ గారు సెట్స్ లో  చాలా ఫ్రండ్లీ గా వుంటారు. సెట్ లో అందరినీ చాలా కంఫర్ట్ బుల్ గా ఉంచుతారు. ఆయన నుంచి సహనం నేర్చుకున్నాను. రావణాసుర షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా.
 
- నేను చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటున్నా.  త్వరగా ఎక్కువ సినిమాలు చేసేయాలనే ఆలోచన లేదు. నా ప్రయాణంపై నాకు స్పష్టత వుంది. మరో ఐదేళ్ళలో ఎక్కడ ఉంటానో ఒక అంచనా వుంది. అందుకే సినిమాల ఎంపిక విషయంలో తొందరపడను. నాకు ఎలాంటి రిగ్రేట్స్ లేవు. అవకాశాలు వస్తాయా రావా అనే భయం కూడా లేదు.
 
- నాకు ప్రయోగాలు చేయడం ఇష్టం. నెగిటివ్, యాక్షన్, పిరియాడిక్ ఇలా భిన్నమైన పాత్రలు చేయడం ఇష్టం. ప్రస్తుతం తెలుగు,  హిందీ, తమిళ్ లో చెరో సినిమా చేస్తున్నా. ఇంకొన్ని చర్చల దశలో వున్నాయి. 
 
- దర్శకత్వం ఆలోచన వుంది. అలాగే ప్రొడక్షన్ చేయాలనే ఆలోచన కూడా వుంది. అయితే దానికి ఇంకా సమయం పడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్న నిహారిక, చైతన్య