Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప-2లోని పాత్ర సవాళ్ళతో ఉన్నా.. ఎంజాయ్ చేశా : రష్మిక

వరుణ్
ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (13:58 IST)
పుష్ప-2 చిత్రంలో తన పాత్ర ఎంతో సవాళ్లతో కూడుకున్నది అయినప్పటికీ తాను ఎంజాయ్ చేస్తూ నటించానని ఆ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్నా తెలిపారు. పుష్ప ది రైజ్ చిత్రానికి సీక్వెల్‌గా పుప్ప-2 ది రూలర్ పేరుతో సీక్వెల్ తెరకెక్కిది. సుకుమార్ దర్శకుడు. అల్లు అర్జున్ హీరో. ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది. హీరోయిన్‌గా రష్మిక పని చేస్తున్నారు. అయితే, ఇందులో తన పాత్ర ఎలా ఉంటుందో తెలిపారు. సవాళ్లతో కూడుకున్నప్పటికీ శ్రీవల్లి పాత్రను పూర్తిగా ఎంజాయ్‌ చేస్తున్నట్టు చెప్పారు. 
 
''పుష్ప'లో అవకాశం వచ్చినప్పుడు సినిమా కథ ఏమిటో? శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుందో.. దానిని స్క్రీన్‌పైకి ఎలా తీసుకురావాలో నాకు తెలియలేదు. మేము ఎలాంటి ప్రపంచాన్ని క్రియేట్‌ చేస్తున్నామో కూడా ఊహించలేదు. నిజం చెప్పాలంటే అప్పుడు, ‘పుష్ప’కు సంబంధించిన ఏ విషయంపైనా నాకు పెద్దగా అవగాహన లేదు. దాంతో నిత్యం సెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఖాళీ మైదానంలోకి వెళ్తున్న భావన వచ్చేది. కానీ, ఇప్పుడు అలా కాదు. నా పాత్ర, కథ అర్థమైంది. సీక్వెల్‌లో నా రోల్‌ మరింత బలంగా ఉండనుంది. ఇప్పుడు శ్రీవల్లి 2.0ని చూస్తారు. అది మాత్రమే చెప్పగలను’’ అని ఆమె అన్నారు.
 
కాగా, 2021లో విడుదలైన పుష్ప చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కథ, స్క్రీన్‌ప్లేతోపాటు పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌ నటన అంతటా విశేష ఆదరణ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. స్మగ్లింగ్‌ సిండికేట్‌కు నాయకుడిగా మారిన తర్వాత పుష్పరాజ్‌ ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? భన్వర్‌ సింగ్‌ షెకావత్‌, దాక్షాయణి, మంగళం శీను నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నాడనే ఆసక్తికర అంశాలతో సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌, రష్మిక లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments