Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్మిక మందన్నతో “సువర్ణ అవకాశం” పోటీ గ్రాండ్ ఫైనల్‌ను నిర్వహించిన టాటా టీ చక్ర గోల్డ్

Advertiesment
Rashmika Mandanna

ఐవీఆర్

, మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (20:58 IST)
దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద టీ బ్రాండ్, టాటా టీ చక్ర గోల్డ్, ప్రతి సిప్‌లోనూ దాని మహోన్నత రుచిని వేడుక జరుపుకుంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలో గత 90 రోజులుగా ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్న సువర్ణ అవకాశం పోటీని ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందన్న సమక్షంలో ముగించింది. "సువర్ణ అవకాశం" కార్యక్రమం, ఇంగ్లీషులో "గోల్డెన్ ఆపర్చునిటీ"గా అనువదించే ఈ పోటీ, కేవలం టీ వేడుక మాత్రమే కాదు; ఇది అద్వితీయమైన క్షణాలు, ఆహ్లాదకరమైన రుచులు, ఊహించని రివార్డ్‌ల యొక్క సంపూర్ణ సమ్మేళనంగా ఆనందాన్ని అందిస్తుంది. వినియోగదారులు టాటా టీ చక్ర గోల్డ్ యొక్క ఏదైనా ఆఫర్ ప్యాక్‌ని కొనుగోలు చేయడం ద్వారా, మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ప్యాక్‌లో ఉన్న ప్రత్యేకమైన కోడ్‌ను చెప్పటం లేదా ప్యాక్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పోటీలో పాల్గొనవచ్చు, ఇది సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.
 
సువర్ణ అవకాశం పోటీ యొక్క ముగింపు లో భాగంగా 25 మంది ఉత్సాహభరితమైన విజేతలను ఒకచోట చేర్చింది, వారు అతిథులతో కలిసి, చక్కటి నటన, అందం గురించి తరచుగా గుర్తుచేసుకునే నటిని కలుసుకున్నారు. టాటా టీ చక్ర గోల్డ్ నిర్వహించిన ఈ కార్యక్రమం, విజేతలకు రష్మిక మందన్నను వ్యక్తిగతంగా కలుసుకునే చిరస్మరణీయమైన అవకాశాన్ని అందించింది, వారి విశేషమైన అనుభవానికి అదనపు గ్లామర్‌ను జోడించింది. రష్మికతో నిర్వహించిన ఆకర్షణీయమైన మీట్, గ్రీట్ సెషన్‌తో పాటు, టాటా టీ చక్ర గోల్డ్ 500 మంది అదృష్టవంతులైన విజేతలకు అద్భుతమైన బంగారు నాణెములను కూడా అందించింది.
 
టాటా టీ చక్ర గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందన్న ఈ భాగస్వామ్యం గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, "నేను పెద్ద టీ ఫ్యాన్‌ని. టాటా టీ చక్ర గోల్డ్‌ని ఆస్వాదించే వరకు నా రోజు ప్రారంభం కాలేదనే భావిస్తాను. నా అభిమానులతో కలిసి ఓ కప్పు టి పంచుకోవడం కంటే సంతోషకరమైనది ఏముంటుంది. టాటా టీ చక్ర గోల్డ్ ద్వారా ఉదహరించిన విలువలకు అద్దం పట్టే సువర్ణ అవకాశం పోటీలో అద్భుతమైన విజేతల మాదిరిగానే, ప్రామాణికత, కృషి, శ్రేష్ఠతను సాధించాలనే తపన విజయానికి మార్గంగా దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ రోజు నా అభిమానులను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారి ఉత్సాహం, అచంచలమైన మద్దతు తనకు తానుగా ఉండవలసిన ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుంది. ఈ చిరస్మరణీయ అనుభవాన్ని సాధ్యం చేసినందుకు టాటా టీ చక్రా గోల్డ్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎంచుకున్న అవకాశాలే నా విజయానికి తోడ్పడ్డాయి, అవి మీ ప్రయాణంలో కూడా మీకు స్ఫూర్తినిస్తాయి. మార్గనిర్దేశం చేస్తాయని నేను ఆశిస్తున్నాను..." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుదేశం పార్టీకి విరాళాలు అందించండి.. వెబ్ సైట్ రెడీ