రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తున్నాము కొన్ని ఫన్ & గేమ్స్ తో త్వరలో ఇంటర్వ్యూ రాబోతోంది అంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి తుపాకులతో ఫోజులిస్తూ.. మంచి అప్ డేట్ ఇవ్వబోతున్నామంటూ ప్రకటించారు. ఇందులో రశ్మిక వివాహం గురించి కూడా క్లారిటీ ఇస్తుందేమోనని సందేశం కూడా అభిమానులకు కలుగుతోంది.
నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చక్కటి లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. నవంబర్ 7న ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.