Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

దేవీ
శుక్రవారం, 27 జూన్ 2025 (15:31 IST)
Rashmika Mandanna
నేషనల్ క్రష్ రష్మిక మందన్న న్యూ మూవీ యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌తో నిన్న అనౌన్స్ చేశారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ద్వారా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో హై బడ్జెట్‌తో నిర్మించనున్నారు. సాయి గోపా సహా నిర్మాత. 
 
రష్మిక అభిమానులను, పరిశ్రమను అలరించే ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ పోస్టర్ తర్వాత, పరిశ్రమల నుంచి రష్మిక మందన్న కొలిగ్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి తెలుగు లుక్, పోస్టర్‌ను లాంచ్ చేశారు. ‘కుబేర’ కో యాక్టర్ ధనుష్ తమిళ్ పోస్టర్, ‘చావా’ కో యాక్టర్ విక్కీ కౌశల్ హిందీ పోస్టర్‌ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ మలయాళ పోస్టర్‌ను, శివరాజ్ కుమార్ కన్నడ పోస్టర్‌ను విడుదల చేశారు. రష్మిక, మైసా టీంకి శుభాకాంక్షలు తెలిపారు.
 
ఈ చిత్రానికి 'మైసా' అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ పోస్టర్ "ఇంతకు ముందు ఎప్పుడూ చూడనిది" అనే పదానికి నిర్వచనంలా వుంది. రష్మిక ఫియర్స్ అండ్ ఇంటెన్స్ లుక్ కట్టిపడేసింది. 
 
సాంప్రదాయ చీరలో, ముక్కుపుడక, ఆభరణాలతో రష్మిక ఒక గోండ్ విమెన్ గా కనిపించారు. ఆమె ఇంటెన్స్ లుక్, రక్తపు మరకలున్న రూపం, ఆమె చేతిలో గట్టిగా పట్టుకున్న వెపన్ అన్నీ ఒక పవర్ ఫుల్ మూవీ ని ప్రామిస్ చేస్తున్నాయి. టైటిల్, ఫస్ట్ లుక్ ప్రాజెక్ట్ క్యురియాసిటీ రేకెత్తించాయి.
 
"మైసా అనేది రెండు సంవత్సరాల కష్టం ఫలితం. కథ, ప్రపంచం, కళా దృక్పథం, పాత్రలు – ప్రతీ అంశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇప్పుడు ఈ కథను ప్రపంచానికి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం" అని దర్శకుడు రవీంద్ర పుల్లె తెలిపారు.
 
ఈ సినిమా గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన అద్భుతమైన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా వుండబోతోంది. 
 
" ఓర్పు ఆమె ఆయుధం. ఆమె గర్జన వినిపించేందుకు కాదు… భయపడించేందుకు! రష్మిక మందన్నను మైసా పాత్రలో చూడండి, ఆమె ఫియర్స్ అవాతర్ ఇదే' అని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. 
 
గత రెండు రోజులుగా సర్ ప్రైజింగ్ ఎనౌన్స్ మెంట్స్, పోస్టర్ రిలీజ్‌లు ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.   
 
ఈ చిత్రానికి సంబంధించి కీలక సాంకేతిక నిపుణుల వివరాలు వచ్చే వారం తెలియజేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల ప్రమాదంలో తల్లి మృతి.. తండ్రి, ముగ్గురు పిల్లలు బయటపడ్డారు...

సారీ డాడీ, ఆమెను వదిలి వుండలేకపోతున్నా, అందుకే మిమ్మల్ని వదలి వెళ్లిపోతున్నా: యువకుడు ఆత్మహత్య లేఖ

కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, దుస్తులు తీసేసి పరార్ అయిన కామాంధులు

శబరిమల అయ్యప్ప భక్తుల కోసం నీలక్కల్‌లో అధునాతన స్పెషాలటీ ఆస్పత్రి

చేవెళ్ల ప్రమాద స్థలంలో హృదయ విదారక దృశ్యాలు: బాధితులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments