Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Advertiesment
Bigg Boss fame Subhasree, Ajay Mysore

దేవీ

, శుక్రవారం, 6 జూన్ 2025 (18:44 IST)
Bigg Boss fame Subhasree, Ajay Mysore
ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్, నటి, బిగ్ బాస్ 7 ఫేమ్ శుభశ్రీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖల నటులు సాయికుమార్, యువ హీరో సోహైల్, బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ తో పాటు  పలువురు సెలబ్రిటీలు పాల్గొని ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంగేజ్ మెంట్, మెహందీ, సంగీత్, రిసెప్షన్ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 
 
Saikumar, sohile and others
ఈ నిశ్చితార్థ వేడుకలో అజయ్ మైసూర్, శుభశ్రీ కలిసి చేసిన మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ ను లాంఛ్ చేశారు. సాయి కుమార్ వాయిస్ తో ఈ పాట ప్రారంభం కావడం ఆకర్షణగా నిలిచింది. మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ ను సిద్ధార్థ్ వాట్కిన్స్ స్వరపర్చి సింగర్ సాహితీ చాగంటితో కలిసి పాడారు. ఈ పాట రూపకల్పన సమయంలోనే వీరి మనసులు కలిసి ప్రేమించుకున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిశ్చయించుకున్నారు. జూలైలో అజయ్ మైసూర్, శుభశ్రీ  వివాహం ఆస్ట్రేలియాలో జరగనుంది.
 
Subhasree, Ajay Mysore
ఎంగేజ్ మెంట్ కార్యక్రమంలో సాయికుమార్ మాట్లాడుతూ.. అజయ్ మైసూర్ నాకు మంచి మిత్రులు. మా ఇంటికి వచ్చి వారి ఎంగేజ్ మెంట్ కోసం ఆహ్వానించారు. ఈ జంట చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని శుభాకాంక్షలు అందజేశారు. హీరో సోహైల్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫ్రెండ్స్, ఇతర సెలబ్రిటీలు ఈ ఎంగేజ్ మెంట్ వేడుకల్లో సందడి చేశారు. మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ కు పనిచేసిన టీమ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొని పాట పాడి వీక్షకులను అలరించారు.
 
ప్రొడ్యూసర్ అజయ్ మైసూర్ అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, 10th క్లాస్ డైరీస్ వంటి చిత్రాలతో పాటు పలు షార్ట్ ఫిలింస్, 50కి పైగా మ్యూజిక్ అల్బమ్స్ లో నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్