Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిన "ఛలో" బ్యూటీ

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (15:36 IST)
"ఛలో" మూవీ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ రష్మిక. ఈమెకు ఓ బాలీవుడ్ ఆఫర్‌ వరించగా, ఆమె సున్నితంగా తిరస్కరించింది. నిజానికి 'గీత గోవిందం' చిత్ర తర్వాత ఈ భామకు పట్టిందల్లా బంగారమే అవుతోంది. 
 
నిజానికి ఈమె తన మొదటి చిత్రంతోనే టాలీవుడ్ ప్రేక్షకులను బుట్టలో వేసుకుంది. 'గీతా గోవిందం' సినిమాతో పలకరించి స్టార్ హీరోయిన్ స్థాయిలో స్టేటస్ సంపాదించేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోవడమే గాక వరుస అవకాశాలు వచ్చేస్తున్నాయి. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ బడా దర్శకుల చూపు కూడా రష్మికపై పడింది.
 
ఈ క్రమంలో ఆమెపై బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కన్నుపడింది. తన కొత్త సినిమాలో రష్మికను ఓ పాత్ర కోసం సంప్రదించారట. అయితే ఈ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉందనే కారణం చూపుతూ రష్మిక ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. 
 
ఇదిలావుంటే, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన తాజా సినిమా 'డియర్ కామ్రేడ్' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ నటించాడు. మరోవైపు మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా రష్మికనే కన్ఫమ్ అయిందనే టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు వెంట రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments