నా కిస్ సీన్‌తో మీకేంటి పని.. అని అడిగిన రష్మిక

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (19:21 IST)
"ఛలో" సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి 'గీత గోవిందం' చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కన్నడ భామ రష్మిక మందన్నా ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలసి 'డియర్ కామ్రేడ్' అనే చిత్రం చేస్తోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్‌గా నటిస్తుండగా.. రష్మిక మందన్నా క్రికెటర్‌గా కనిపించనుంది. 
 
ఈ చిత్రం మే 31వ తేదీన విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని ఇటీవ‌ల‌ తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌ల చేసారు. టీజ‌ర్ చివ‌రిలో విజ‌య్, ర‌ష్మిక‌ల మ‌ధ్య లిప్ లాక్ సీన్ ఉండ‌గా, దీనిపై నెటిజ‌న్స్ ఫైర్ అవుతున్నారు.
 
నీ లిప్‌లాక్ కారణంగా నువ్వంటే నాకు అసహ్యమేస్తోంది అంటూ ఓ అభిమాని కామెంట్ చేసాడు. సినిమా అవకాశాల కోసం ఇలా చేస్తున్నావా.. అంటూ మరొక అభిమాని కామెంట్ పెట్టాడు. మరొక నెటిజన్ రష్మిక మాజీ బాయ్‌ఫ్రెండ్‌ని ట్యాగ్ చేస్తూ.. ‘రిప్ రక్షిత్ శెట్టి’ అని ట్వీట్ చేసారు. రష్మికపై కన్నడ నాట కూడా పలు విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఈ నేప‌థ్యంలో రష్మిక ఇంటర్వ్యూ ద్వారా నెటిజ‌న్ల కామెంట్స్‌కి బ‌దులిచ్చింది. సినీ అవకాశాల కోసం ఆ సీన్ చేయలేదని, సినిమాలోని పాత్రకి న్యాయం చేయడానికే అలా చేసానని ఆమె అన్నారు. ఇద్దరు ప్రేమికుల మధ్య సందర్భానికి తగ్గట్టు నటించామని, సీన్ డిమాండ్ చేయ‌డం వ‌ల‌న అలా చేశాం త‌ప్ప కావాల‌ని చేసింది కాదు అని ర‌ష్మిక వివ‌ర‌ణ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments