రాళ్లు కాదు బిస్కెట్లు వేయండి: కరిచే కుక్కలపై రష్మి గౌతమ్ టిప్స్

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (19:25 IST)
జబర్దస్త్ మరియు యూట్యూబ్ పుణ్యమా అని మంచి పాపులారిటీ సంపాదించింది రష్మీ గౌతమ్. అప్పుడప్పుడూ సినిమాలలో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సామాజిక సమస్యలు, విషయాలపై ముక్కుసూటిగా తన అభిప్రాయాలు చెప్తుండటం ఆమె నైజం. అంతేకాకుండా మూగజీవాలకు సంబంధించిన పోస్ట్‌లు కూడా పెడ్తూ ఉంటుంది. 
 
గతంలో ఒకసారి సృష్టిలోని ఈగలను కాపాడుకోవడం మన బాధ్యత అని, అందుకోసం ఓ స్పూన్‌‌లో కొంచెం పంచదార, లేదంటే తీపి పదార్థాలను ఉంచాలని సూచించింది. మరోసారి ఆవుల వధను వ్యతిరేకిస్తూ అందరినీ మెప్పించే సందేశమిచ్చింది. ఇప్పుడు కుక్కల గురించి పెట్టిన పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
 
మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు చాలా కుక్కలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు అవి అరుస్తాయి, కరిచేందుకు కూడా వస్తాయి. అలాంటి కుక్కలపై రాళ్లు వేయడం బుద్ధితక్కువ పని అని, అలా కాకుండా వాటికి బిస్కెట్లు వేస్తే అవి ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయని, తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మనల్ని కాపాడతాయని పేర్కొంది. ఇక రష్మీ కూడా బంబుల్ అనే కుక్కపిల్లని పెంచుకుంటోంది. దానితో దిగిన ఫోటోలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

120 కిలోల గంజాయి స్వాధీనం.. ఒడిశా నుండి గంజాయి.. ఉపాధ్యాయుడు, భార్య..?

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025- దేశం నుంచి 100మందికి స్థానం.. ఆరుగురు తెలుగువారికి కూడా ప్లేస్

Jagan: అరెరె.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే.. లండన్‌కి జగన్ జంప్ అయ్యారే..

బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments