Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్లతో పోల్చుకుంటే నా ఎక్స్‌పోజింగ్ ఎంత? రష్మీ గౌతమ్

రష్మీ గౌతమ్‌... తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు.. బుల్లితెరపై కూడా పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా బుల్లితెరకు గ్లామర్‌ సొబగులు అద్దిన ఘనత ఈమెకే చెందుతుంది. అందంగా మాట్లాడటమేకాకుండా అందంగా కనిపించడం, అం

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (16:14 IST)
రష్మీ గౌతమ్‌... తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు.. బుల్లితెరపై కూడా పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా బుల్లితెరకు గ్లామర్‌ సొబగులు అద్దిన ఘనత ఈమెకే చెందుతుంది. అందంగా మాట్లాడటమేకాకుండా అందంగా కనిపించడం, అందుకు తగిన డ్రస్సులు వేసుకోవడం ఈమె స్టైల్. ఈ ప్రత్యేకతలే ఆమెను బుల్లితెర నుంచి వెండితెర వైపు నడిపించాయి. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా, గ్లామరస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చిపెట్టాయి. దాంతోపాటే వెండితెర మీద అందాల ఆరబోత ఆమెకు బోలెడంత గుర్తింపు తెచ్చిపెట్టింది. 
 
అయితే, ఎక్స్‌పోజింగ్‌పై రష్మీ స్పందిస్తూ, పాత్ర పరంగా డ్రెస్సులు వేసుకోవాలి. ‘గుంటూరు టాకీస్‌’లో అదే చేశాను. పైగా, ఈ చిత్రంలో పాత్ర పరంగా అందాల ఆరబోత ఉంది. అంతే తప్ప ప్రత్యేకంగా నేనేమీ ఎక్స్‌పోజింగ్‌ చేయలేదు. కొందరు హీరోయిన్లతో పోల్చుకుంటే నేను ఎక్స్‌పోజింగ్‌ చేసేది తక్కువే. ఇంకాచెప్పాలంటే వారు చేసిన దానిలో 30 శాతం ఎక్స్‌పోజింగ్ కూడా చేయను. అయినా నా మీద అలాంటి ముద్ర ఎందుకు పడిందో నాకు అర్థం కాదు. గ్లామర్‌ గర్ల్‌ అనిపించుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదని అంటోంది. 
 
త్వరలో విడుదల కానున్న ‘నెక్ట్స్‌ నువ్వే’ చిత్రంలో చాలా భాగం సంప్రదాయబద్ధంగానే కనిపిస్తాను. ‘గుంటూరు టాకీస్‌’ తర్వాత నాకు మంచి పేరు తెచ్చే పాత్ర అవుతుంది. దీని తర్వాత మంచి మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను. ఈ సినిమాకి నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నట్టు వివరించింది. అయితే, ఈ చిత్రం ట్రైలర్‌లో ఉన్నట్టుగా సినిమాలో అందాల ఆరబోత ఉండదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments