Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది చూడాలో, చూడకూడదో వారికి తెల్సు.. అడల్ట్ షోనా.. హాట్ యాంకర్ ఫైర్

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (12:24 IST)
'జబర్దస్త్' కామెడీ షోకి ప్రేక్షకాదరణ ఎంతగా లభించిందో అన్నే వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ఈ షోతో ఎంతోమంది పేరుప్రఖ్యాతులు సంపాదించుకుని ఇప్పుడు కెరీర్‌లో ఉన్నతస్థానంలో ఉన్నారు. వారిలో రష్మి కూడా ఒకరు. సినిమాలలో సహాయపాత్రలు వేసుకుంటున్న రష్మి ఈ షోలో యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుని, ఆపై పలు సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. ఇక అప్పుడప్పుడూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో తళుక్కున మెరుస్తున్న రష్మి తాజాగా తెలంగాణ మంచిర్యాలలో క్విక్కర్ బజార్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది. 
 
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రష్మి తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి తెలియజేస్తూ, వివాదాస్పద సమస్యలపై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తాను హీరో నందుతో కలిసి ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నానని, ఆ సినిమాకు సంబంధించి వైజాగ్‌లో షూటింగ్ జరుగుతోందని చెప్పారు. మీరు తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు, జబర్దస్త్‌లో కూడా ఇప్పుడు డబుల్ మీనింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి.. ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది కదా అంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నతో చిందులు తొక్కిన రష్మి ఈ విధంగా సమాధానమిచ్చింది. 
 
‘కాంట్రవర్సీలు మేము కాదు చేస్తున్నది, మేము చాలా క్లీన్ అండ్ నీట్ ఎంటర్‌టైన్మెంట్ అందించాలని అనుకుంటున్నాము. కానీ దాన్ని మీరు చూసే విధానంలో ఉంటుంది. పైగా ప్రైమ్ టైమ్‌లో వచ్చే షోలు అడల్ట్స్ కోసం. వాళ్ళకంటూ సొంతంగా ఓ ఆలోచన ఉంటుంది. ఏది తీసుకోవాలి.. ఏది ఫిల్టర్ చేయాలో వారి బాగా తెలుసు. ఆ ఎంపిక మేము మీకు ఇస్తున్నాము. ఓటు హక్కుతో పాటుగా ఆలోచించే హక్కు కూడా మీకు ఉంది. కరెక్ట్‌గా ఆలోచించండి’ అంటూ తెలివైన జవాబుతో మీడియాకు షాక్ ఇచ్చింది రష్మి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments