Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్సిక కడుపుకొడుతున్న రాశీఖన్నా.. ఛాన్సుల్లేక బేర్ మంటున్న తెల్లపిల్ల

హన్సిక మోత్వాని.. తెలుగు వెండితెరకు తొలిసారి పరిచయమైంది. కానీ, ఇక్కడ అదృష్టం ఆమెకు కలసిరాలేదు. దీంతో తమిళ సినిమా బాట పట్టింది. అక్కడ అభిమానులు ఆమెకు నీరాజనం పలికారు.

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (16:35 IST)
హన్సిక మోత్వాని.. తెలుగు వెండితెరకు తొలిసారి పరిచయమైంది. కానీ, ఇక్కడ అదృష్టం ఆమెకు కలసిరాలేదు. దీంతో తమిళ సినిమా బాట పట్టింది. అక్కడ అభిమానులు ఆమెకు నీరాజనం పలికారు. ఆ దెబ్బతో ఆమె స్టార్ స్టేటస్‌ను కొట్టేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే చేతి నిండా సినిమాలతో ఫుల్‌బిజీ. ఎప్పుడూ కనీసం ఆరేడు సినిమాలైనా ఆమె చేతిలో ఉండేవి. ఆమెకు అభిమానులు గుడి కట్టేదాకా వెళ్లింది ఆమె స్టేటస్. 
 
కానీ, బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవుతాయన్న చందంగా.. సీన్ రివర్స్‌ అయింది. చేతికొచ్చిన సినిమా ఆఫర్లు సైతం చేజారిపోతున్నాయట. కారణం.. రాశీఖన్నానే అని కోలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే ఆమె ప్రత్యక్షంగా హన్సికకు చేసిన నష్టమేం లేదు కానీ... ఇప్పటిదాకా హన్సికను నెత్తిన పెట్టుకున్న కోలీవుడ్ ఇప్పుడు రాశీఖన్నాను నెత్తినెత్తుకుంది. 
 
అక్కడి సినీ అభిమానులకు కూడా హన్సిక అంటే మొహం మొత్తేసినట్టుందని, అందుకే ఫ్రెష్ ఫేస్ అయిన రాశీఖన్నాపై అభిమానం పెంచేసుకుంటున్నారని అంటున్నారు. హన్సిక వరకు వెళ్లిన సినిమాలన్నీ కూడా రాశీఖన్నా చేతుల్లో పెడుతున్నారట దర్శక నిర్మాతలు. దానికి కారణం.. ఆమెకు పెరుగుతున్న క్రేజేనట. 
 
ఆకట్టుకునే పర్‌ఫెక్ట్ నటన, అందమైన చిరునవ్వు, ఆకర్షించే అందం ఆమెకు కలిసొచ్చిన అంశాలని చెబుతున్నారు. ఇప్పటికే మూడు సినిమాలకు రాశీ సంతకం చేయగా, మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇటు తెలుగులోనూ ఆమె బిజీగా మారిపోయింది. ఇలా వరుస ఆఫర్లతో ఆమె దూసుకెళుతోంది.
 
దీంతో ఆమె కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిపోతోందని సినీ జనం అంటున్నారు. ఇక, హన్సిక పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కోలీవుడ్‌లో ఇప్పుడామె ఒప్పుకొన్న సినిమాలేవీ లేవు. తెలుగులో మంచు విష్ణు, గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న సినిమాల్లో మాత్రం నటిస్తోంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments