Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెమో కూడా పవన్ కల్యాణ్ అభిమానేనట.. శివకార్తీకేయన్ కూడా భజన గ్యాంగ్‌లో చేరిపోయాడా?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు వీరాభిమానులున్నారు. ఇలా పవన్ అంటే వీరాభిమానం చూపించే వాళ్లలో ముందుండే హీరో నితిన్.ఈ జాబితాలో మరికొందరు కూడా ఉన్నారు

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (16:20 IST)
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు వీరాభిమానులున్నారు. ఇలా పవన్ అంటే వీరాభిమానం చూపించే వాళ్లలో ముందుండే హీరో నితిన్.ఈ జాబితాలో మరికొందరు కూడా ఉన్నారు. తాజాగా మరో కుర్ర హీరో ఆ జాబితాలో చేరిపోయాడు. పవన్ భజనలో తేలుతున్న హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. కోలీవుడ్ కుర్ర హీరో శివ కార్తికేయన్ తనకూ పవన్ అంటే వీరాభిమానం అంటున్నాడు. 
 
తమిళంలో సూపర్ హిట్ కొట్టిన రెమో సినిమాను తెలుగులో అట్టహాసంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో శివకార్తీకేయన్ మాట్లాడుతూ, తాను పవన్‌కు వీరాభిమానినని.. పవన్ గబ్బర్ సింగ్ సినిమాను చెన్నై థియేటర్‌లో చూశానని చెప్పుకొచ్చాడు. పవన్ అభిమానుల కేరింతల నడుమ ఆ సినిమా చూడడం మంచి అనుభూతినిచ్చిందని చెప్పాడు. 
 
ఇకపోతే.. త్రివిక్రమ్ సినిమాలో పవన్ కల్యాణ్ పరిచయానికి అనిరుధ్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. పవన్ అన్ని సినిమాలను విడుదలైన రెండు మూడు రోజుల్లోనే చూసేస్తానని చెప్పాడీ రెమో. అయితే రెమో కామెంట్స్‌పై సినీ జనం వేరేలా మాట్లాడుకుంటున్నారు. తన సినిమాకు మంచి పేరు కొట్టేయాలని రెమో పవన్ భజన చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే పవన్ పేరు చెప్పుకుని సినిమాలు రిలీజ్ చేసి.. కలెక్షన్లు కుమ్మేస్తున్న హీరోల సంఖ్య బాగానే పెరిగిపోతోందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. 

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments