Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఖైదీ నెంబర్ 150''ని బ్రేక్ చేసిన 'రంగస్థలం': ఆ భాషల్లోకి చెర్రీ సినిమా?

''రంగస్థలం'' కొత్త రికార్డులను కొల్లగొడుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రికార్డును అధిగమించాడు. తాజాగా ఖైదీ నెంబర్ 150 రికార్డును రంగస్థలం బ్రేక్ చేసింది. బాహుబలి రికార్డును పక్కనబెడితే.. వసూళ్ల పరం

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (14:59 IST)
''రంగస్థలం'' కొత్త రికార్డులను కొల్లగొడుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రికార్డును అధిగమించాడు. తాజాగా ఖైదీ నెంబర్ 150 రికార్డును రంగస్థలం బ్రేక్ చేసింది. బాహుబలి రికార్డును పక్కనబెడితే.. వసూళ్ల పరంగా బాహుబలి తర్వాత నిలిచిన ''ఖైదీ నెంబర్ 150''ని రంగస్థలం వెనక్కి నెట్టింది. ఈ క్రమంలో రంగస్థలం రూ.164 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.
 
మార్చి30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ''రంగస్థలం'' తొలిరోజునే 128 కోట్లను కొల్లగొట్టింది. అలాగే 13వ రోజుకు చేరుకునే సరికి రూ.161కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఇక 14వ రోజున చిరంజీవి ''ఖైదీ నెం.150'' రికార్డును అధిగమించిందని సినీ విశ్లేషకులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తండ్రి మెగాస్టార్ సెట్ చేసిన రికార్డును చెర్రీ బ్రేక్ చేశాడు.
 
ఇదిలా ఉంటే.. రంగస్థలం సినిమా ఇతర భాషల్లోకి డబ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను ప్రధానంగా తమిళంలోకి, హిందీలోకి, మలయాళంలోకి అనువాదించాలని సుకుమార్ పక్కా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇదివరకూ చరణ్ చేసిన సినిమాలు తమిళంలోకి అనువాదం అయ్యాయి. మగధీర, గోవిందుడు అందరివాడూలే.. సినిమాలు తమిళంలో హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఇక చరణ్ హిందీలో నేరుగానే సినిమానే చేశాడు. దీంతో రంగస్థలం సినిమా హిందీ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments